New Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. జూలై – సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారీగా కోలువులు

Subhash Goud

Subhash Goud | Edited By: Phani CH

Updated on: Jul 30, 2021 | 10:15 AM

New Jobs: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి కారణంగా తగ్గిపోయిన ఉద్యోగ అవకాశాలు తిరిగి పుంచుకునే అవకాశాలున్నాయి. కోవిడ్‌ మహమ్మారి కారణంగా తగ్గిన ఉద్యోగాల నియామకాల..

New Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. జూలై - సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారీగా కోలువులు

New Jobs: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి కారణంగా తగ్గిపోయిన ఉద్యోగ అవకాశాలు తిరిగి పుంచుకునే అవకాశాలున్నాయి. కోవిడ్‌ మహమ్మారి కారణంగా తగ్గిన ఉద్యోగాల నియామకాల ప్రక్రియ తిరిగి పుంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. 21 రంగాలలో 700కు పైగా చిన్న, మధ్యస్థ, పెద్ద కంపెనీల నియామకాల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తుంది. ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన తాజా టీమ్ లీజ్ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ నివేదిక ప్రకారం.. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నప్పటికీ 38% కంపెనీలు ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే 34% అధికంగా నియామకాల ప్రక్రియను చేపట్టాయి. టీమ్ లీజ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో అన్ని రంగాలలో కంపెనీలు అన్ని కరోనా నిబంధనలు పాటిస్తూ కొత్త నియామకాలను చేపట్టినట్లు తెలిపారు.

కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ఆంక్షలను సడలించడం, వినియోగదారుల డిమాండ్ పెరగడం, ఆర్థిక కార్యకలాపాల్లో పెరుగుదల వంటి అనేక కారణాల వల్ల బ్లూ-కాలర్, వైట్ కాలర్ నిపుణుల నియామకాన్ని సంస్థలు చేబడుతున్నాయని పేర్కొన్నారు. జాబ్ మార్కెట్ గణనీయంగా కొలుకొనున్నట్లు దాల్మియా సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర సింఘి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, కొన్ని పరిశ్రమలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో అనేక రంగాలలో కొత్త నియామకాల ప్రక్రియ మరింత వేగవంతం అయ్యిందని అన్నారు. వ్యాక్సినేషన్ స్థాయిలు పెరగడం కూడా ఈ ధోరణికి సహాయపడుతుందని ఆయన తెలిపారు.

ఇవీ కూడా చదవండి

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు… విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు.. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 30

Eklavya Schools: ఆంధ్రప్రదేశ్‌కు 28 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ళు మంజూరయ్యాయి : కేంద్రమంత్రి రేణుక సింగ్‌

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu