Redmi Laptop: రెడ్‌మి నుంచి భారత మార్కెట్లోకి తొలి ల్యాప్‌టాప్‌.. ధర, ఫీచర్స్‌ వివరాలు.. విడుదల ఎప్పుడంటే..!

Redmi Laptop: షియోమి సబ్​బ్రాండ్​ రెడ్‌మి నుంచి భారత మార్కెట్​లోకి ఆగస్ట్​ 3న తొలి ల్యాప్‌టాప్‌ విడుదల కానుంది. ఇప్పటికే రెడ్​మీ 2019 నుంచి చైనా మార్కెట్​లో ల్యాప్‌టాప్‌లను..

Redmi Laptop: రెడ్‌మి నుంచి భారత మార్కెట్లోకి తొలి ల్యాప్‌టాప్‌.. ధర, ఫీచర్స్‌ వివరాలు.. విడుదల ఎప్పుడంటే..!
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Jul 29, 2021 | 8:15 AM

Redmi Laptop: షియోమి సబ్​బ్రాండ్​ రెడ్‌మి నుంచి భారత మార్కెట్​లోకి ఆగస్ట్​ 3న తొలి ల్యాప్‌టాప్‌ విడుదల కానుంది. ఇప్పటికే రెడ్​మీ 2019 నుంచి చైనా మార్కెట్​లో ల్యాప్‌టాప్‌లను విక్రయిస్తుంది. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత గ్లోబల్​ మార్కెట్​లోకి వీటిని విడుదల చేయనుంది. ఇందులో భాగంగా తొలిసారి భారత మార్కెట్​లోకి ల్యాప్​టాప్​ విడుదల కానుంది. రెడ్​మీ ఇటీవల నిర్వహించిన నోట్​10టీ స్మార్ట్​ఫోన్​ లాంచింగ్​ ఈవెంట్​లో ఈ ల్యాప్​టాప్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దీన్ని రెడ్​మిబుక్​ లైనప్​లో తీసుకురానున్నట్లు తెలిపింది. దీని డిజైన్​, కలర్​ ఆప్షన్లను ఇప్పటికే టీజ్​ చేసింది. ఇది ముదురు బూడిద రంగులో రానున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రెడ్​మీ ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఆగస్ట్ 3న భారత మార్కెట్​లోకి విడుదలయ్యే రెడ్‌మిబుక్ తో లాప్​టాప్ మార్కెట్​లోకి కూడా ప్రవేశించనున్నామని, రెడ్‌మీ ఉత్పత్తులైన పవర్ బ్యాంక్, టిడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్‌లు, స్మార్ట్ టివి సరసన రెడ్​మీ ల్యాప్​టాప్​లు కూడా చేరనున్నాయని అన్నారు.

అయితే, భారత మార్కెట్​లోకి విడుదలయ్యేందుకు సిద్దంగా ఉన్న రెడ్​మీ బుక్​ ధర, ఫీచర్లను అధికారింగా వెల్లడించనప్పటికీ, సోషల్ మీడియాలో కొన్ని లీకులు చక్కర్లు కొడుతున్నాయి. రెడ్​మీబుక్​ 8వ జనరేషన్​ ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్​తో రానుంది. దీనిలో ఎన్విడియా జిఫోర్స్ MX250 గ్రాఫిక్స్ కార్డ్​ను అందించనున్నారు. ఇది 512GB వరకు సాలిడ్-స్టేట్ డ్రైవ్ (SSD), 10 గంటల బ్యాటరీ బ్యాకప్​తో వస్తుందని తెలుస్తోంది. ఈ ల్యాప్​టాప్​ 14 అంగుళాలు, 16 అంగుళాల డిస్​ప్లేలు గల రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ రెండూ రూ .50 వేల ధరల శ్రేణిలో వచ్చే అవకాశం ఉంది. రెడ్‌మీ భారతీయ పీసీ మార్కెట్​లోకి ప్రవేశిస్తుండటంతో ఇది హెచ్‌పి, లెనోవా, డెల్, ఏసెర్ వంటి ప్రముఖ బ్రాండ్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఇవీ కూడా చదవండి

LIC: అదిరిపోయే ఎల్‌ఐసీ పాలసీ.. ఈ ప్లాన్‌ తీసుకుంటే ప్రతియేటా 12 వేల వరకు పొందవచ్చు.. ఎలాగంటే..!

Smartphone: మీ పాత ఫోన్‌ వేరే వ్యక్తులకు అమ్మేస్తున్నారా..? అయితే ఇది తప్పనిసరిగా చేయాల్సిందే.. ఎందుకంటే..!

Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా..? అయితే ఈ షార్ట్‌కట్స్‌ గురించి తెలుసుకోండి..!

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!