- Telugu News Photo Gallery Technology photos International data corporation released data about smart phone growth in 2021 q2 list of top five phones
Top SmartPhones: ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడు పోతున్న స్మార్ట్ ఫోన్ ఏంటో తెలుసా? టాప్ 5 ఫోన్‌ల జాబితా ఇదే..
Top SmartPhones: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. మరి ఎక్కువ మంది వినియోగదారులు ఏ బ్రాండ్ ఫోన్‌లవైపు మొగ్గు చూపుతున్నారు.? ఏ కంపెనీల ఫోన్‌లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 31, 2021 | 9:20 AM

అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోన్న స్మార్ట్ ఫోన్‌ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ రీసెర్చ్ సంస్థ అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ గ్రోత్ ఇన్ 2021 క్యూ2 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం మొదటి ఐయిదు స్థానాల్లో ఉన్న స్మార్ట్ ఫోన్‌లు ఇవే..

2021 క్యూ2లో 59 మిలియన్ యూనిట్లను రవాణా చేసిన సామ్‌సంగ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఫోన్ మార్కెట్ షేర్ 18.8 శాతంగా నమోదైంది.

ఇక 53.1 మిలియన్ యూనిట్లను రవాణా చేసే షియోమి రెండో స్థానంలో ఉంది. ఈ బ్రాండ్ మార్కెట్ షేర్ 28.5 శాతంగా ఉంది. షియోమీ యాపిల్‌ను వెనక్కి నెట్టడం గమనార్హం.

ఇక 44.2 మిలియన్ యూనిట్ల రవాణాతో యాపిల్ మూడో స్థానానికి దిగజారింది. ఈ బ్రాండ్ మార్కెట్ షేర్ 14.1 శాతంగా ఉంది.

తర్వాతి స్థానంలో ఒప్పో నిలిచింది. ఈ బ్రాండ్ 2021 క్యూ 2లో 32.8 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. దీని మార్కెట్ షేర్ 10.5 శాతంగా ఉంది.

31.6 మిలియన్ యూనిట్లను రవాణా చేసి వివో ఐయిదో స్థానంలో నిలిచింది. ఈ బ్రాండ్ షేర్ 2021 క్యూ2 లో 29.5 శాతంగా ఉంది.




