Sandes App: లోక్‌ సభలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన.. వాట్సాప్‌ తరహాలో ‘సందేశ్‌’ యాప్‌

Sandes App: వాట్సాప్‌ తరహాలో వన్‌టూవన్‌ మెజేజింగ్‌ గ్రూప్‌, గ్రూప్‌ మెసేజింగ్‌, ఫైల్‌, మీడియా షేరింగ్‌, ఆడియో, వీడియో కాల్స్‌ తదితర ఫీచర్లతో కేంద్ర ప్రభుత్వం సందేశ్‌ పేరుతో..

Sandes App: లోక్‌ సభలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన.. వాట్సాప్‌ తరహాలో 'సందేశ్‌' యాప్‌
Sandes App
Follow us
Subhash Goud

|

Updated on: Jul 31, 2021 | 5:44 AM

Sandes App: వాట్సాప్‌ తరహాలో వన్‌టూవన్‌ మెజేజింగ్‌ గ్రూప్‌, గ్రూప్‌ మెసేజింగ్‌, ఫైల్‌, మీడియా షేరింగ్‌, ఆడియో, వీడియో కాల్స్‌ తదితర ఫీచర్లతో కేంద్ర ప్రభుత్వం సందేశ్‌ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. నేషనల్ ఇన్ఫోర్మేటిక్స్ సెంటర్ (NIC) తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి ఈ యాప్‌ను రూపొందిస్తున్నాయి. పూర్తిగా స్వదేశీగా ఈ యాప్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయం తెచ్చే పనిలో కేంద్రం నిమగ్నమైంది.

ఈ సందర్భంగా పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేసింది. వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ నిబంధనల నేపథ్యంలో కేంద్రం స్వదేశీ వాట్సాప్‌ను విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యాప్‌కు సంబంధించి కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ లోక్‌ సభలో కీలక ప్రకటన చేశారు.

నేషనల్ ఇన్ఫోర్మేటిక్స్ సెంటర్ తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి డిజైన్‌ చేసిన ఈ స్వదేశీ వాట్సాప్‌ సందేశ్‌ యాప్‌ అందరికి అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ నిర్వహణ బాధ్యతలన్నీ కేంద్ర ప్రభుత‍్వమే చూసుకుంటుందని ఆయన అన్నారు. వాట్సాప్ తరహాలో అన్ని ఫీచర్స్‌ ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు మాత్రమే వాడుతున్న ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఇక ఈ యాప్‌ ప్రత్యేకత ఏంటంటే వాట్సాప్‌ కేవలం ఫోన్‌ నెంబర్‌తో మాత్రమే లాగిన్‌ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ సందేశ్‌ యాప్‌ మాత్రం ఈమెయిల్ తో ఓపెన్ చేసేలా రూపొందించారు.

ఇవీ కూడా చదవండి

Gold: బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్‌.. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జోరుగా పసిడి కొనుగోళ్లు.. ఎంతంటే..!

5G Network: స్మార్ట్‌ఫోన్‌ సంస్థ ఒప్పోతో జతకట్టిన రిలయన్స్‌ జియో.. 5జీ నెట్‌ వర్క్‌ కోసం పరీక్షలు..!