Allu Arha: అల్లు అర్హ క్యూట్ వీడియో షేర్ చేసిన స్నేహా రెడ్డి.. బన్నీ డాటర్ ఏం చేస్తుందో చూశారా..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jul 31, 2021 | 4:26 PM

కరోనా కారణంగా ఎంతో మంది పిల్లలు తమ చదువులకు దూరమయ్యారు. ఏడాది కాలంగా స్కూల్స్ మూతపడిపోవడంతో

Allu Arha: అల్లు అర్హ క్యూట్ వీడియో షేర్ చేసిన స్నేహా రెడ్డి.. బన్నీ డాటర్ ఏం చేస్తుందో చూశారా..
Arha

Follow us on

కరోనా కారణంగా ఎంతో మంది పిల్లలు తమ చదువులకు దూరమయ్యారు. ఏడాది కాలంగా స్కూల్స్ మూతపడిపోవడంతో ఆన్‏లైన్ క్లాసులతో పాఠాలను బోధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‏టాప్స్ వినియోగం మరింత పెరిగిపోయింది. కోవిడ్ కేసులు తగ్గుతున్నా.. స్కూల్స్ యాధావిధిగా కొనసాగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. గతంలో బడులు తెరిచినా.. మరోసారి కరోనా ప్రభావం చూపించింది. దీంతో మళ్లీ స్కూల్స్ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మహమ్మారి ప్రభావంతో ఆన్ లైన్ పాఠాలకు పిల్లలు కూడా అలవాటు పడిపోయారు. అయితే అల్లు అర్జున్ కూతురు కూడా ఆన్‏లైన్ ద్వారానే తన చదువును కొనసాగిస్తోంది.

Allu Sneha

Allu Sneha

ఎప్పుడు సోషల్ మీడియాలో డైలాగ్స్ చెబుతూ.. ఆటలు ఆడుతూ… అల్లరి చేస్తూ కనిపించే అల్లు అర్హ..తాజాగా ఆన్‏లైన్ క్లాసులలో బిజీగా ఉంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి.. తన ఇన్‏స్టా స్టోరీలో షేర్ చేశారు. అందులో అల్లు అర్హ ఎంతో శ్రద్ధగా.. కింద కూర్చుని ఆన్ లైన్ క్లాసులు వింటోంది. ఇదిలా ఉంటే.. అటు అల్లు అర్హ.. చైల్డ్ ఆర్టిస్ట్‏గా వెండితైరపైకి కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్హ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Also Read: Priyamani: ‘నారప్ప’ సినిమాతో నా కోరిక నెరవేరింది.. నా ఫోటో కూడా అక్కడ ఉండాలి.. ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు..

Pawan Kalyan: గబ్బర్ సింగ్ వర్సెస్ భీమ్లా నాయక్..! ఈ పోటీ చాలా ఇంట్రస్టింగ్ గురూ!

Childhood Photo: నేను ధరించే దుస్తులు రేపు నా పిల్లలు చూసేలా ఉండాలి అన్న హీరోయిన్ చిన్ననాటి ఫోటో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu