AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: గబ్బర్ సింగ్ వర్సెస్ భీమ్లా నాయక్..! ఈ పోటీ చాలా ఇంట్రస్టింగ్ గురూ!

Bheemla Nayak Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతంలో... గబ్బర్‌సింగ్‌, సర్దార్ గబ్బర్‌సింగ్‌ సినిమాల్లో ఖాకీ డ్రస్ వేసినా.. ఆ పాత్రల్లో సీరియస్ నెస్ కంటే కామిక్‌ ఫ్లేవరే ఎక్కువగా కనిపించింది.

Pawan Kalyan: గబ్బర్ సింగ్ వర్సెస్ భీమ్లా నాయక్..! ఈ పోటీ చాలా ఇంట్రస్టింగ్ గురూ!
Bheemla Nayak
Janardhan Veluru
|

Updated on: Jul 31, 2021 | 3:35 PM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతంలో… గబ్బర్‌సింగ్‌, సర్దార్ గబ్బర్‌సింగ్‌ సినిమాల్లో ఖాకీ డ్రస్ వేసినా.. ఆ పాత్రల్లో సీరియస్ నెస్ కంటే కామిక్‌ ఫ్లేవరే ఎక్కువగా కనిపించింది. తన ఒరిజినల్ మేనరిజమ్ ని మిక్స్ చేస్తూ.. తానే ఇష్టపడి.. ఆ పోలీస్ పాత్రల్లో హ్యూమర్ జొప్పించి.. దాన్ని కావాల్సిన మేరకు పండించగలిగారు పవన్. గబ్బర్ సింగ్ వరకు పవన్ స్టయిల్ ఆఫ్ జోవియలిజాన్ని బాగా ఎంజాయ్ చేశారు ఆయన ఫ్యాన్స్. న్యూట్రల్ ఆడియెన్స్ కూడా గబ్బర్ సింగ్ కి బాగా కనెక్ట్ అయ్యారు.

సర్దార్ గబ్బర్ సింగ్‌లో ఆ హ్యూమర్ కాస్తా డోస్ పెరగడం ప్రేక్షకులకు నచ్చలేదు. సినిమా థీమ్‌కి… అందులో పవన్ మూమెంట్స్‌కి పొంతన లేకపోవడంతో ఫలితం తారుమారయ్యింది. ఎంతో విశ్వసించి నిర్మాణంలో భాగస్వామిగా చేరిన పవర్ స్టార్ కి నిరాశే మిగిలిందని ఇండస్ట్రీ టాక్. సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితం పవన్‌లో మార్పులు తీసుకొచ్చినట్టు అప్పట్లో చెప్పుకున్నారు.

సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం… మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ చేయాల్సి రావడం… యాక్సిడెంటల్ గా జరిగినా… భీమ్లా నాయక్ క్యారెక్టర్ విషయంలో మాత్రం పవన్ లైట్ తీసుకోదలుచుకోలేదు. మలయాళం ఒరిజినల్లో వున్న సీరియస్ నెస్‌ని డిస్టర్బ్ చెయ్యకుండా.. తెలుగు రీమేక్ ని విజయవంతం చేయాలన్నది పవన్ ఆలోచన.

భీమ్లా నాయక్‌… వస్తున్నాడు అంటూ లేటెస్ట్ గా రిలీజైన మేకింగ్ వీడియో… పవన్ ఫ్యాన్స్ ని ఎలెర్ట్ చేసింది. ఇందులో పవన్‌ గెస్చర్స్ చూసినవాళ్లు ఏదో ఫ్రెష్ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పోలీస్‌ యూనిఫామ్‌లో… రొమ్ములు విరుచుకుని నడిచొచ్చే తీరు.. పెరిగిన ఛాతీ సైజు.. కళ్ళల్లో ఆ ఉరిమే ఉరుము… అన్నీ పవన్ లో కొత్త పోలీస్ ని చూపిస్తున్నాయి.. అనేది ఫస్ట్ టాక్. ఖాకీ డ్రస్ లో కూడా మునుపటి రెక్లెస్ నెస్ కనిపించలేదు. బటన్స్ విప్పి.. ఎర్ర తువ్వాలు మెళ్ళో వేసుకుని కాకుండా.. సిన్సియర్ మోస్ట్ అనిపిస్తున్నారు. ఇలా హుందాతనం గల పోలీసాఫీసర్ గా.. తమ భీమ్లా నాయక్… గబ్బర్ సింగ్ కంటే గొప్ప సక్సెస్ కొడతారన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది అభిమానుల దగ్గర.

(రాజా శ్రీహరి, టీవీ9 తెలుగు, ఎంటర్‌టైన్మెంట్ డెస్క్)

Also Read..

నేను ధరించే దుస్తులు రేపు నా పిల్లలు చూసేలా ఉండాలి అన్న హీరోయిన్ చిన్ననాటి ఫోటో

ప్రమాదాన్ని పసిగట్టిన శునకం.. వెంటనే ట్రాఫిక్‌ రూల్స్‌ను తెలుసుకుంది. ఆలోజింపచేస్తున్న ట్రాఫిక్‌ పోలీస్‌ వీడియో..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్