గర్భిణీ స్త్రీలు బాదం పప్పును ఏ సమయంలో తినాలో తెలుసా.. ఎలా తీసుకుంటే మంచిదంటే..
సాధారంగా బాదం పప్పు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
సాధారంగా బాదం పప్పు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉండడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదంలో విటమిన్-ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబోప్లోవిన్, మాంగనీస్, కాపర్ సైతం ఉంటాయి. రోజూ ఉదయాన్నే మూడు, నాలుగు బాదంపప్పులను నానబెట్టినవి తినడం మంచిది.. అయితే గర్బిణీ స్త్రీలు బాదం పప్పు తినడం మంచిదే అంటున్నారు నిపుణులు. గర్భిణీలు పలు రకాల వంటకాలలో బాదం పప్పును తీసుకోవాలట. అయితే గర్భిణీ స్త్రీలు నానబెట్టిన బాదం పప్పు తినవచ్చా ? వారి ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి.
గర్భధారణ సమయంలో మహిళలు బాదం తినాలా ? వద్దా ? పేరెంటింగ్ ఫస్ట్‌క్రీ వార్తల ప్రకారం గర్భధారణ సమయంలో పచ్చి బాదం తినడం సురక్షితమే. వాటిలో ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే గర్భిణీ స్త్రీకి బాదం లేదా ఇతర డ్రై ఫ్రూట్‌లకు అలర్జీ ఉంటే ఖచ్చితంగా బాదం తినడం మానుకోవాలి.
గర్భధారణలో నానబెట్టిన బాదం యొక్క ప్రయోజనాలు.. బాదంపప్పుకు అలెర్జీ లేనివారు గర్భధారణ సమయంలో నానబెట్టిన బాదంపప్పును తినవచ్చు. నానబెట్టిన బాదం జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది. అలాగే దీనిని నానబెట్టడం వలన దాని పోషక విలువలు మరింత పెరుగుతాయి. రాత్రిపూట నానబెట్టిన బాదం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మంలో టానిన్‌లు ఉండటం వలన పోషకాహారం శోషణను తగ్గిస్తాయి. అయితే వాటి పొట్టు తీసి తినడం ఉత్తమం.
నానబెట్టిన బాదం, పచ్చి బాదం.. బాదంపప్పు ఆరోగ్యానికి మంచివే. అలాగే నానబెట్టిన బాదం పప్పు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. అయితే బాదంపప్పును రాత్రిపూట నానబెట్టడం వలన ఫైటిక్ యాసిడ్‌ని తొలగించి, భాస్వరాన్ని విడుదల చేసి ఎముకల ఆరోగ్యానికి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గర్భిణీలు నానబెట్టిన బాదం కాకుండా.. పొడి బాదం తినడం వలన ఫైటిక్ ఆమ్లం ఖనిజ లోపానికి కారణమవుతుంది. గర్భిణీలు మొదటి నెల నుంచి చివరి నెల వరకు బాదం పప్పు తినవచ్చు. ఉదయం, సాయంత్రం రెండు సార్లు తినడం మంచిది. ఎక్కువగా తినకూడదు.
Also Read: Health Tips: మన పరిసరాల్లో ఉండే ఈ పువ్వులు వ్యాధులను తగ్గిస్తాయట.. ఎలా ఉపయోగించాలంటే..