Chennangi Aaku Podi: నొప్పులకు అపర సంజీవని ‘చెన్నంగి’… ఈ ఆకుతో పొడి తయారీ ఎలా తయారు చేసుకోవాలంటే
Chennangi Aaku Podi: ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదాలు ఆకుకూరలు. ఇప్పటి జనరేషన్ కు తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర వంటివి మాత్రమే తెలుసు.. కానీ మన..
Chennangi Aaku Podi: ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదాలు ఆకుకూరలు. ఇప్పటి జనరేషన్ కు తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర వంటివి మాత్రమే తెలుసు.. కానీ మన అమ్మమ్మని అడిగితే చెబుతుంది.. చేల గట్ల మీద దొరికే ఆకుకూరలు ఎన్ని రకాలు ఉన్నాయో.. అవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో.. ఈరోజు అజీర్ణ సమస్యలు తీర్చే చెన్నంగి దీనినే కొంతమంది కసివింద అని కూడా అంటారు.. ఈ ఆకుతో పొడి తయారు చేయడం ఎలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి తెలుసుకుందాం..
పొడి తయారీకి కావాల్సినవి:
చెనంగాకు- మూడుకప్పులు, ఎండుమిర్చి- ఐదు, జీలకర్ర- చెంచా, ధనియాలు- రెండు చెంచాలు, మెంతులు- పావుచెంచా, చింతపండు- నిమ్మకాయంత, పసుపు- చిటికెడు, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె- మూడుచెంచాలు
తయారీ:
ముందుగా చెన్నంగి ఆకుని శుభ్రం చేసిన తర్వాత తడిలేకుండా నీడపట్టున ఆరబెట్టుకోవాలి. స్టౌ వెలిగించి బాండీ పెట్టుకుని చెంచాడు నూనెవేసి వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో నూనె వేసి అందులో ఆరిన చెన్నంగి ఆకు వేసి తడి మొత్తం పోయేలా నిదానంగా వేయించుకోవాలి. మిక్సీలో ముందుగా వేయించుకున్న దినుసులని బరకగా పొడిచేసుకుని… చెనంగాకు, చింతపండు, ఇంగువ, పసుపు, తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి. మరొక్కసారి బాణలిలో ఆ పొడిని వేయించుకుంటే తడి ఉంటే అది కూడా పోతుంది. చల్లారిన తర్వాత సీసాలో వేసి పెట్టుకోవాలి.
ప్రయోజనాలు: ఈ చెన్నంగి ఆకు గ్రామీణ వైద్యానికి పెట్టింది పేరు. నాడీ నొప్పులను తగ్గిస్తుంది. పైపూతగా, నోటి మందుగా కూడా ఉపయోగపడుతుంది. అజీర్ణ సమస్యలు, కాలేయ సమస్యలున్నప్పుడు ఉపశమనం కోసం తింటారు. కడుపులో ఇన్‌ఫెక్షన్లు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
Also Read: నేరేడు పండు తిని.. గింజలను పడేస్తున్నారా.. అవి షుగర్ కు బెస్ట్ మెడిసిన్ అనే విషయం మీకు తెలుసా