Jamun Seeds: నేరేడు పండు తిని.. గింజలను పడేస్తున్నారా.. అవి షుగర్ కు బెస్ట్ మెడిసిన్ అనే విషయం మీకు తెలుసా

Jamun Seeds: ప్రకృతి మనకు అందించిన వరం లో ఒకటి పండ్లు.. ఆయా సీజనల్ లో దొరికే పండ్లను తింటే.. మన శరీరానికి ఆ కాలానికి అనుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పించేలా రోగనిరోధక శక్తి..

Jamun Seeds: నేరేడు పండు తిని.. గింజలను పడేస్తున్నారా.. అవి షుగర్ కు బెస్ట్ మెడిసిన్ అనే విషయం మీకు తెలుసా
Jamun Seeds
Follow us
Surya Kala

|

Updated on: Jul 04, 2021 | 8:10 AM

Jamun Seeds: ప్రకృతి మనకు అందించిన వరం లో ఒకటి పండ్లు.. ఆయా సీజనల్ లో దొరికే పండ్లను తింటే.. మన శరీరానికి ఆ కాలానికి అనుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పించేలా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక ప్రస్తుత సీజనల్ లో ఎక్కువగా దొరికేవి నేరేడు పండ్లు.. వీటిని ఈ సీజన్ లో రోజుకు రెండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే.. అయితే నేరేడు పండుకే దాని విత్తనాల్లో కూడా అనేక పోషకాలున్నాయి. పలు వ్యాధులను నివారిస్తుంది. నేరేడులో అధిక శాతం ఫైబర్ ఉంటుంది. అంతేకాదు ఇది రోగనిరోధక వ్యవస్థకు పెద్ద పుష్టినిచ్చే అనేక పోషకాలతో నిండి ఉంది. అయితే నేరేడు గింజలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.. అయితే నేరేడు గింజలను.. పొడి రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

*నేరేడు గింజలు షుగర్ పేషేంట్స్ కు మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ విత్తనాల పొడి తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. *ఈ విత్తనాలు పొడి, రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అంతేకాదు ఈ నేరేడు గింజల్లో ఫ్లేవనాయిడ్లు , ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. *నేరేడు పండు గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. *మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం నుంచి వ్యర్ధాలను బయటకు పంపిస్తుంది. *రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికీ విత్తనాలు మంచి ఔషధం.

గింజలను ఎలా తీసుకోవాలంటే..

నేరేడు గింజలను సేకరించి ఎండబెట్టి.. చూర్ణం (పొడి)గా చేసుకోవాలి. లేదా కొని ఆయుర్వేద షాపుల్లో కూడా నేరేడు పండు విత్తనాల చూర్ణం దొరుకుతుంది. అయితే ఈ నేరేడు గింజల పొడిని డైరెక్ట్ గా తినలేరు కనుక .. పొడిని స్మూతీలతో కలిపి తీసుకోవచ్చు లేదా నీటితో కూడా కలిపి తీసుకోవచ్చు. అయితే ఈ చూర్ణం ఉపయోగించాలని అనుకునేవారు ముందుగా వైద్యుడిని సంప్రదిస్తే.. తగిన మోతాదు.. ఎలా ఉపయోగించాలానే విషయాలను సూచిస్తారు.

Also Read: కరేబియన్ దేశమైన హైతిలో విమానం ప్రమాదం.. ఆరుగురు మృతి.. మృతుల్లో ఇద్దరు అమెరికెన్లు..