Private Plane Crash: కరేబియన్ దేశమైన హైతిలో విమానం ప్రమాదం.. ఆరుగురు మృతి.. మృతుల్లో ఇద్దరు అమెరికెన్లు
Private Plane Crash: కరేబియన్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. హయతిలో విమానం కూలి ఆరుగురు ప్రయాణీకులు మరణించారు. ఈ ప్రమాదం విమానం రాజధాని నగరం పోర్ట్ ఆ ప్రిన్స్‌కు వెళ్తుండగా జరిగిందని స్థానికులు..
Private Plane Crash: కరేబియన్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. హైతిలో విమానం కూలి ఆరుగురు ప్రయాణీకులు మరణించారు. ఈ ప్రమాదం విమానం హైతి రాజధాని నగరం పోర్ట్ ఆ ప్రిన్స్‌కు వెళ్తుండగా జరిగిందని స్థానికులు చెప్పారు. ఈ విమానం జాక్మెల్ కు వెళ్ళడానికి సిటీ ఎయిర్‌పోర్ట్ లో సాయంత్రం 6గంటల 57నిమిషాలకు బయల్దేరిందని నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్ తెలిపింది.
మృతుల్లో ఇద్దరు అమెరికాకు చెందిన ట్రెంట్ హాస్టెల్టర్, 35, మరియు జాన్ మిల్లెర్ (43)లని ఫేస్ బుక్ పేజీలో చేసిన ఓ పోస్టు ఆధారంగా ప్రయాణికుల వివరాలను తెలిశాయని అధికారులు చెప్పారు. కొంతమంది పెద్ద గ్రూప్ గా ఏర్పడి.. రెండు విమానాల్లో జాక్మెల్ కు బయలు దేరారని అధికారులు ఎంక్వైరీలో తెలిసింది.
ముందుగా ఆరుగురు సభ్యులు ఈ ప్రయివేట్ విమనంలో బయలుదేరారు.. అనంతరం మరో విమానంలో వెళ్లాల్సిన బృందానికి.. ఈ ప్రమాద విషయం తెలిసి.. తమ ప్రయాణాన్ని విరమించుకున్నారని ఎయిర్ పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాద ఘటనపై స్పందించిన NCAO ఆరుగురు ప్రయాణిస్తున్న విమానం కూలి అక్కడికక్కడే మొత్తం ఆరుగురు మృతి చెందారని చెప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న నిఘా సంస్థలు ప్రమాద వివరాలను సేకరిస్తుంది.
Also Read: ఓ పెళ్లికి వెళ్లిన అతిథులకు వింత అనుభవం.. గెస్టులతో అంట్లు తోమించిన కొత్త జంట..