AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delta Variant: వేగంగా వ్యాప్తిస్తున్న డెల్టా వేరియంట్.. 98 దేశాల్లో గుర్తింపు .. నివారణ చర్యలను సూచించిన డబ్ల్యుహెచ్ఒ చీఫ్

WHO on Delta Variant: చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఇంకా వణికిస్తూనే ఉంది. రోజుకో కొత్త రూపం సంతరించుకుని ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ప్రస్తుతం అనేక దేశాల్లో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తిస్తూ..

Delta Variant: వేగంగా వ్యాప్తిస్తున్న డెల్టా వేరియంట్.. 98 దేశాల్లో గుర్తింపు .. నివారణ చర్యలను సూచించిన డబ్ల్యుహెచ్ఒ చీఫ్
Delta Variant
Surya Kala
|

Updated on: Jul 04, 2021 | 6:48 AM

Share

WHO on Delta Variant: చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఇంకా వణికిస్తూనే ఉంది. రోజుకో కొత్త రూపం సంతరించుకుని ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ప్రస్తుతం అనేక దేశాల్లో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తిస్తూ.. ఆందోళన కలిస్తుందని.. ఇంకా చెప్పాలంటే ప్రపంచం క్లిష్ట సమయంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్‌ గెబ్రాయాసిస్‌ చెప్పారు.

కరోనా కట్టడికిి నిరంతర పరిశీలన అవసరమని, ప్రజారోగ్య ప్రతిస్పందనను సరిగ్గా నిర్వహించాలని సూచించారు. డెల్టా వేరియంట్‌ ను 98 దేశాల్లో గుర్తించామని చెప్పారు. అయితే ఈ వేరియంట్ వ్యాక్సినేషన్ కు సంబంధం లేకుండా వ్యాప్తి చెందుతుందని.. అంతేకాదు సరికొత్త రూపం సంతరించుకుని.. మరింత విజృంభిస్తుందని .. అది చాలా ప్రమాదకరమని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కొత్త వైరస్‌ను తరిమికొట్టేందుకు రెండు మార్గాలున్నాయని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెప్పారు. ముఖ్యంగా ప్రతి ఒక్కదేశం ప్రజారోగ్యం, సామాజిక చర్యలు పటిష్టమైన నిఘా పై దృష్టి పెట్టాలని సూచించారు. అంతేకాదు త్వరగా కేసులను గుర్తించడం, ఐసోలేషన్‌, క్లినికల్‌ కేర్‌ , మాస్క్‌, భౌతిక దూరం, రద్దీ ప్రదేశాల్లో సమూహాలను నివారించడం, ఇండోర్‌ ప్రాంతాలు వెంటిలేషన్‌ సదుపాయాలు చూసుకోవడం ఉండాలని అన్నారు.

ఈ డెల్టా వేరియంట్ ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఆక్సిజన్, కరోనా పరీక్షలు, చికిత్స, వ్యాక్సిన్లు సమానంగా షేర్ చేసుకోవాలని టెడ్రోస్ సూచించారు. ఈ వైరస్ ను అరికట్టడానికి అన్ని దేశాలు సహకరించుకోవాలని సూచించారు. అంతేకాదు 2022 జూలై వచ్చే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో దాదాపు 70 శాతం వ్యాక్సినేషన్ వేయించుకునేలా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ మహమ్మారిని ప్రపంచ దేశాలనుంచి తరిమి కొట్టడానికి… ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకునేందుకు ఇవే సరైన మార్గాలని చెప్పారు. ఈ సెప్టెంబర్‌ నాటికి మీ దేశ జనాభాలో 10 శాతం మందికైనా వ్యాక్సిన్‌ అందించాలని పలు దేశాలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్లు ఉత్పత్తికి సాంకేతికను పంచుకోవాలని బయో ఎన్‌టెక్‌, మోడార్నా, ఫైజర్‌ వంటి టీకా సంస్థలను టెడ్రోస్కోరారు. దీని వల్ల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. త్వరలో వ్యాక్సినేషన్‌ హబ్‌లు ప్రారంభిస్తామని..  ప్రపంచం వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని ఎంత త్వరగా పెంచితే.. అంత త్వరగా ఈ వైరస్ ను అంతమొందించగలమని ఆయన చెప్పారు.

Also Read: PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.2 వేలు వేసేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం..!