Food Festival: సాంస్కృతిక వారసత్వాన్ని రేపటి తరానికి అందించేందుకు ఫుడ్ ఫెస్టివల్.. కన్నడిగుల వంటకాలు ఒక్కచోట సందడి
తమ సాంస్కృతిక వారసత్వాన్ని రేపటి తరానికి అందించడానికి భాగ్యనగరంలో కన్నడిగులు నడుం కట్టారు. అవును హైదరాబాద్ లో కన్నడిగుల వంటకాలు ఒక్కచోట చేరాయి.
కన్నడిగులు సంప్రదాయ ప్రియులు. కొత్తకు పట్టంకడుతూనే పాతను ప్రేమిస్తారు. ఓ వైపు ఆధునికతను ఆదరిస్తూనే.. తమ తరాల కళలను గౌరవిస్తారు. ఈ నేపథ్యంలో తమ సాంస్కృతిక వారసత్వాన్ని రేపటి తరానికి అందించడానికి భాగ్యనగరంలో కన్నడిగులు నడుం కట్టారు. అవును హైదరాబాద్ లో కన్నడిగుల వంటకాలు ఒక్కచోట చేరాయి. కర్ణాటక శిక్షణా సమితి. ఆధ్వర్యంలో కర్ణాటక ఫుడ్ ఫెస్టివల్ ను కాచిగూడ నృపతుంగా కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక శిక్షణా సమితి సెక్రెటరీ ముకుంద్ కులకర్ణి మాట్లాడుతూ కర్ణాటక వంటకాలు బావి తరాలకు తెలియ చెప్పేందుకు ఫుడ్ ఫెస్టివల్ మొదటిసారి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలో నివాసం ఉన్న కర్ణాటక కుటుంబాల మహిళలు తమ ఇంట్లో తమ వండిన వంటకాలను తీసుకువచ్చి ఈ ఫుడ్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు.
ముఖ్యంగా కన్నడిగులకు ఇష్టమైన బిస్ బిల్లా బాత్, బక్రి (జొన్న రొట్టె) తో పాటు వివిధ రకాల ఆహారాలు వండి తక్కువ రేటు తో బోజన ప్రియులకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్బంగా కల్చరల్ ప్రోగ్రామ్ ఆకట్టుకుంది.
అయితే కన్నడిగులు స్పెషల్ ఫుడ్ చామదుంప ఆకుల కూర, వెదురు మొలకల కూర.. (బైంబ్ళే కరి) వర్షాకాలంలో విరివిగా దొరికే వెదురు మొలకలలతో తయారు చేసే కూరలు, బియ్యప్పిండి పుల్కాలైన అక్కి రొట్టిల, బియ్యం రవ్వతో చేసే కుడుములు కడంబుట్టు కోసం ఆహార ప్రియులు ఆత్రంగా ఎదురుచూశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..