ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుడ్లు తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
గుడ్డు సంపూర్ణ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్‌గా చెబుతారు. గుడ్డులో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉండటంతో పాటు, విటమిన్ ఎ, డి, ఇ, బి12, రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, ఇటీవలి కాలంలో చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుడ్డు తినటం అలవాటుగా చేసుకుంటున్నారా.. కానీ, ఇలా ఖాళీ కడుపుతో గుడ్లు తినడం సురక్షితమేనా..? పోషకాహార, వైద్య ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే...

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తినేవారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఖాళీ కడుపుతో గుడ్లు తినడం వల్ల కొంతమందికి ఉబ్బరం, గ్యాస్, కడుపు తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కొంతమందికి గుడ్లు అలెర్జీ కలిగి ఉంటారు. అలాంటి వారు పొరపాటున కూడా ఖాళీ కడుపుతో గుడ్లు తినకూడదు. ఇలా తినటం వల్ల చర్మంపై తామర, శరీరంలో వాపు, వికారం, వాంతులు లేదా విరేచనాలు వంటి జీర్ణశయాంతర సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఉదయం అల్పాహారంలో గుడ్లు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో ఇతర ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడుతుంది. ఉదయం మీ అల్పాహారంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు సమతుల్య పరిమాణంలో సమృద్ధిగా ఉండే వాటిని ఎల్లప్పుడూ చేర్చండి. ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి లేదా సగం ఉడికించిన గుడ్లు తినడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ సమస్య కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అలాంటి గుడ్లు తినడం వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉంది. ఈ బాక్టీరియా అతిసారం, జ్వరం, కడుపు నొప్పి వంటి లక్షణాలను కలిగిస్తుంది.
గుడ్లలో ఉండే మంచి మొత్తంలో ప్రోటీన్ కొన్నిసార్లు కొన్ని యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏదైనా యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు మీరు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోండి.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








