International Tea Day 2021: అంతర్జాతీయ టీ దినోత్సవం.. ఒత్తిడిని, నొప్పుల్ని తగ్గించే ఇలాచి టీతో ఎన్నో ప్రయోజనాలు..
International Tea Day 2021: ఛాయ్.. చుక్క నోటిలో పడనిదే రోజు స్టార్ట్ కాదు చాలా మందికి. ఉదయాన్నే టీ తాగడం వలన ఎంతో హుషారుగా, ఉత్సాహంగా కనిపిస్తారు.
International Tea Day 2021: ఛాయ్.. చుక్క నోటిలో పడనిదే రోజు స్టార్ట్ కాదు చాలా మందికి. ఉదయాన్నే టీ తాగడం వలన ఎంతో హుషారుగా, ఉత్సాహంగా కనిపిస్తారు. ఇక ఎంతటి ఒత్తడిలో ఉన్న ఒక్క టీ తాగితే.. స్ట్రెస్ మొత్తం ఇట్టే తగ్గిపోతుంది. ఇక చాలా మందికి రోజుకు మూడు నాలుగు సార్లు టీ తాగనిదే మనసు నిలవనివ్వదు. ఇక వేసవికాలంలోనూ టీ తాగే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గదు. అందుకే ఛాయ్ గొప్పతనాన్ని చాటుతూ.. ఇప్పటికే ఎంతో మంది కవితలు, పాటలు కూడా రాశారు. మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవం. ఈ రోజున ఎప్పుడూ తాగే సాధారణ టీ కాకుండా.. మీ ఒత్తిడిని, నొప్పుల నుంచి క్షణాల్లో ఉపశమనం కలిగించే యాలకుల టీ తాగడం ఉత్తమం. ఈ టీతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..
✤ ఇలాచీ ఛాయ్ ముఖ్యంగా అజీర్తి సమస్యను నివారిస్తుంది. వికారంగా ఉన్నప్పుడు వేడివేడిగా ఓ కప్పు టీ తాగితే ఫలితం ఉంటుంది. అలాగే ఇది మలబద్ధకాన్నీ దూరం చేస్తుంది. ✤ యాలకుల్లో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అధిక రక్తపోటుకు కారణనమయ్యే ప్రీరాడికల్స్ను నియంత్రిస్తాయి. అలాగే రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి గుండె మీద ఒత్తిడి పడకుండా చేస్తాయి. రోజులో రెండు మూడు సార్లు టీ తాగేవారు ఒక్కసారైన యాలకుల టీ తాగాల్సిందే. ✤ ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. అందువలన గొంతునొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నోటి దుర్వాసనా తగ్గుతుంది. ✤ నెలసరి సమయంలో కడుపు, నడుము నొప్పితో బాధపడేవారు ఓ కప్పు ఇలాచీ ఛాయ్ తాగితే ఉపశమనం ఉంటుంది.
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవో తెలుసా..
sonu sood: పాన్ ఇండియా మూవీలో హీరోగా సోనూసూద్.. డైరెక్ట్ చేయబోతున్న టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్…