Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవో తెలుసా..
త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ,మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.
Updated on: May 21, 2021 | 2:07 PM

అందం, అభినయం, అనుకువ ,అల్లరి తో ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ .

త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ,మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.

ఇక తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ యంగ్ హీరోలతో జత కడుతూ దూసుకుపోతుంది అనుపమ

శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే,రాక్షసుడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

ఇండస్ట్రీకి వచ్చిన దగ్గరనుంచి దాదాపు 10 సినిమాల్లో నటించే అవకాశం మిస్ చేసుకుంది ఈ చిన్నది. కొన్ని పారితోషికం కారణంగా.. మరికొన్ని అనివార్య కారణాలతో వదిలేసుకుంది అనుపమ.

నాని నేను లోకల్,శర్వానంద్ మహానుభావుడు, రామ్ చరణ్ రంగస్థలం, నితిన్ ఛల్ మోహన్ రంగా, ఎన్టీఆర్ అరవింద సమేత (ఈషా రెబ్బా పాత్ర), బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్ ఇస్మార్ట్ శంకర్ (నభా నటేష్ పాత్ర), నిఖిల్ అర్జున్ సురవరం, నాని వి (అదితిరావు హైదరీ పాత్ర),అనుష్క నిశ్శబ్ధం (షాలిని పాండే పాత్ర)

ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 18 పేజీస్ సినిమాలో నటిస్తుంది అనుపమ.





























