International Coffee Day 2021: కాఫీ పండించే 5 సుందర ప్రదేశాలు..! చూస్తే మైమరచిపోతారు..
International Coffee Day 2021: కాఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరు ఇష్టపడుతారు. అంతేకాదు కాఫీ షాపులో నిత్యం ఎంతమంది ఉంటారో మీరు చూసే ఉంటారు.
International Coffee Day 2021: కాఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరు ఇష్టపడుతారు. అంతేకాదు కాఫీ షాపులో నిత్యం ఎంతమంది ఉంటారో మీరు చూసే ఉంటారు. ఎప్పుడు చూసినా సందడిగా ఉంటుంది. అనేక రకాల కాఫీలను ఆస్వాదిస్తూ ఉంటారు. చల్లని కాఫీ నుంచి వేడి కాఫీ వరకు రకరకాల కాఫీలు, రుచులను ఎంజాయ్ చేస్తారు. కాఫీ అధిక మోతాదు హానికరం కావచ్చు కానీ కప్పు కాఫీ ఔషధం కంటే తక్కువేమి కాదు. ఇది అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధిని తగ్గిస్తుంది. హార్మోన్ ఎపినెఫ్రిన్ పెంచడానికి సహాయపడుతుంది. అయితే కాఫీ పండించే ప్రదేశాలు కూడా చాలా సుందరంగా ఉంటాయి. ఒక్కసారి వాటి గురించి తెలుసుకుందాం.
1. చిక్‌మగళూరు, కర్నాటక భారతదేశంలో బ్రిటిష్ పాలనలో కాఫీని మొట్టమొదటి సారిగా కర్నాటకలోని చిక్ మగళూరులో ప్రవేశపెట్టారు. ఇది కూర్గ్ నుంచి కొన్ని గంటల దూరంలో ఉంటుంది. ఇక్కడి ప్రకృతి సంపద పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది.
2. కూర్గ్, కర్నటక ఇది అరబికా, రోబస్టా రకాలను ఉత్పత్తి చేసే అనేక కాఫీ తోటలకు నిలయం. నవంబర్ నెలలో ఇక్కడ పర్యటిస్తే బాగుంటుంది. అలాగే కూర్గ్ తేనె కూడా దొరుకుతుంది.
3. ఎర్కాడ్, తమిళనాడు చాలా కాఫీ తోటలను కలిగి ఉన్నందున ఎర్కాడ్‌ని ‘జ్యువెల్ ఆఫ్ ద సౌత్’ అని పిలుస్తారు. ఇది మాత్రమే కాదు భారతదేశంలో మొట్టమొదటి కాఫీ తోట అయిన MSPకి నిలయం.
4. వయనాడ్, కేరళ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ కాఫీ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ మీరు పచ్చని కాఫీ తోటలను ఆస్వాదించవచ్చు.
5. అరకు, ఆంధ్రప్రదేశ్ వేలాది మంది గిరిజనులు ఇక్కడ కాఫీ సాగులో అంతర్భాగం. మీరు అరకులో ఉంటే స్థానిక ప్రజలు పండించే సేంద్రీయ కాఫీ బ్రాండ్ కాఫీని తాగి తీరాల్సిందే. జీవితంలో మరిచిపోని రుచిని ఆస్వాదిస్తారు.
6. అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని అంతర్జాతీయ కాఫీ సంస్థ ప్రకటించింది. మొదటి అంతర్జాతీయ కాఫీ దినోత్సవం1 అక్టోబర్ 2015 న నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కాఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.