KKR vs PBKS, IPL 2021: పంజాబ్ టార్గెట్ 166.. అర్థశతకంతో ఆకట్టుకున్న వెంకటేష్ అయ్యర్

KKR vs PBKS: కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

KKR vs PBKS, IPL 2021: పంజాబ్ టార్గెట్ 166.. అర్థశతకంతో ఆకట్టుకున్న వెంకటేష్ అయ్యర్
Ipl 2021, Kkr Vs Pbks
Follow us
Venkata Chari

|

Updated on: Oct 01, 2021 | 9:30 PM

KKR vs PBKS: ఐపీఎల్ -14లో భాగంగా 45 వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) టీంలు దుబాయ్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోల్‌కతా ఓపెనర్లలో శుభ్మన్ గిల్ (7) త్వరగానే ఔటైనా.. మరో ఓపెనర్ 67(49 బంతులు, 9 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో ఆకట్టుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లపై బౌండరీలతో చుక్కలు చూపించాడు.

కాగా, రాహుల్ త్రిపాఠి(34 పరుగులు, 26 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పర్వాలేదనిపించినా.. ఇయాన్ మోర్గాన్(2) మరోసారి విఫలమయ్యాడు. నితీష్ రాణా (31 పరుగులు, 18 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) కొద్దిసేపు మైదానంలో మెరుపులు కురిపించాడు. 172 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసి పంజాబ్ బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. దినేష్ కార్తీక్ 11 చేసి చివరి బంతికి బౌల్డయ్యాడు. నరైన్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, రవి బిష్ణోయ్ 2, షమీ ఒక వికెట్ పడగొట్టారు.

కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ టీం ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచులో ఖచ్చితంగా గెలవాల్సిందే. పంజాబ్ టీంకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే. కేకేఆర్ టీం ప్రస్తుతం 10 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 11 మ్యాచుల్లో 6 మ్యాచులు ఓడిపోయారు. పంజాబ్ కింగ్స్ టీం 7 మ్యాచుల్లో ఓడిపోయి ఆరో స్థానంలో నిలించింది. ఇరు జట్ల మధ్య మొత్తం 28 మ్యాచులు జరిగాయి. ఇందులో కేకేఆర్ టీం 19, పంజాబ్ కింగ్స్ టీం 9 మ్యాచుల్లో గెలుపొందాయి. చివరిసారిగా ఈ రెండు టీం తలపడినప్పుడు కేేకేఆర్ టీం అహ్మదాబాద్‌లో సులభంగా విజయం సాధించింది.

Also Read: KKR vs PBKS Live Score, IPL 2021: పంజాబ్ కింగ్స్ టార్గెట్ 166.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న వెంకటేష్ అయ్యర్

Ravichandran Ashwin: దినేష్ కార్తీకే అసలైన అపరాధి.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.. అశ్వి‎న్‎కు అండగా మాజీలు

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!