IPL 2021, KKR vs PBKS Match Result: రాహుల్ క్లాస్.. షారుఖ్ మాస్ ఇన్నింగ్స్.. ఉత్కంఠ మ్యాచులో 5 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం
KKR vs PBKS: చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ టీం 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి సాధించింది.
KKR vs PBKS, IPL 2021: ఐపీఎల్ -14లో భాగంగా 45 వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) టీంలు దుబాయ్‌లో తలపడిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ టీం 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి సాధించింది. కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజులో నిలిచి విజయానికి కావాల్సిన పరుగులు సాధించాడు. చివర్లో షారుక్ ఖాన్ 9 బంతుల్లో 2 సిక్సులు, 1 ఫోర్ సహాయంతో 244.4 స్ట్రైక్ రేట్‌తో 22 పరుగులు సాధించి పంజాబ్ టీంను గెలిపించాడు.
పంజాబ్ ఓపెనర్లు అద్భుతమైన ఓపెనింగ్‌తో టీంకు కావాల్సిన గట్టి పునాదిని అందించారు. 166 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ మొదలు పెట్టిన ఓపెనర్లు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే మొదల్లో రాహుల్ చాలా స్లోగా ఆడుతూ ఎక్కువగా మయాంక్‌కు ఎక్కువ అవకాశం ఇచ్చాడు. అయితే (40 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 3 సిక్సులు) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్‌లో మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 70 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెర పడింది.
పూరన్ (12), మక్రాం (18), దీపక్ హుడా (3) ధాటిగా ఆడే క్రమంలో త్వరగా వికెట్లు కోల్పోయారు. అనంతరం క్రీజులోకి వచ్చిన షారుక్ ఖాన్(15)తో కలిసి ఓపెనర్ రాహుల్ కీలక భాగస్వామ్యం అందించాడు. ఓపెనర్ రాహుల్(67 పరుగులు, 54 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) చివరి వరకు క్రీజులో ఉండి పంజాబ్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.
అంతకు ముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోల్‌కతా ఓపెనర్లలో శుభ్మన్ గిల్ (7) త్వరగానే ఔటైనా.. మరో ఓపెనర్ 67(49 బంతులు, 9 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో ఆకట్టుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లపై బౌండరీలతో చుక్కలు చూపించాడు.
కాగా, రాహుల్ త్రిపాఠి(34 పరుగులు, 26 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పర్వాలేదనిపించినా.. ఇయాన్ మోర్గాన్(2) మరోసారి విఫలమయ్యాడు. నితీష్ రాణా (31 పరుగులు, 18 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) కొద్దిసేపు మైదానంలో మెరుపులు కురిపించాడు. 172 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసి పంజాబ్ బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. దినేష్ కార్తీక్ 11 చేసి చివరి బంతికి బౌల్డయ్యాడు. నరైన్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, రవి బిష్ణోయ్ 2, షమీ ఒక వికెట్ పడగొట్టారు.
WHAT A WIN! ? ?
Yet another nail-biter as @PunjabKingsIPL pull off a 5 wicket win over #KKR in Dubai. ? ? #VIVOIPL #KKRvPBKS
Scorecard ? https://t.co/lUTQhNzjsM pic.twitter.com/3J2N1X6a4G
— IndianPremierLeague (@IPL) October 1, 2021
Also Read: KKR vs PBKS, IPL 2021: పంజాబ్ టార్గెట్ 166.. అర్థశతకంతో ఆకట్టుకున్న వెంకటేష్ అయ్యర్