KKR vs PBKS Highlights, IPL 2021: ఉత్కంఠ మ్యాచులో పంజాబ్ కింగ్స్‌దే విజయం.. 5 వికెట్ల తేడాతో కేకేఆర్ ఓటమి
KKR vs PBKS Highlights in Telugu: కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
KKR vs PBKS Highlights in Telugu: ఐపీఎల్ -14లో భాగంగా 45 వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) టీంలు దుబాయ్‌లో తలపడిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ టీం 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి సాధించింది. కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజులో నిలిచి విజయానికి కావాల్సిన పరుగులు సాధించాడు. చివర్లో షారుక్ ఖాన్ 9 బంతుల్లో 2 సిక్సులు, 1 ఫోర్ సహాయంతో 244.4 స్ట్రైక్ రేట్‌తో 22 పరుగులు సాధించి పంజాబ్ టీంను గెలిపించాడు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
కేకేఆర్ టీం ప్రస్తుతం 10 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 11 మ్యాచుల్లో 6 మ్యాచులు ఓడిపోయారు. పంజాబ్ కింగ్స్ టీం 7 మ్యాచుల్లో ఓడిపోయి ఆరో స్థానంలో నిలించింది. ఇరు టీంలకు ఈ మ్యాచ్ చాలా కీలకమే. పంజాబ్ కింగ్స్ టీంలో కేఎల్ రాహుల్ (422 పరుగులు), మయాంక్ అగర్వాల్ (332 పరుగులు) మాత్రమే రాణిస్తున్నారు. మిడిలార్డర్ అంతా పేలవంగా తయారైంది. ఇక పంజాబ్ బౌలర్లలో రవి బిష్టోయ్ 9 వికెట్లతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. రవి తప్ప మరో బౌలర్ పంజాబ్ నుంచి మంచి ప్రదర్శన ఇవ్వడం లేదు. మరోవైపు కేకేఆర్ టీం తరపున అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ సమతూకంగా రాణిస్తున్నారు. మరి ఇలాంటి జట్టును పంజాబ్ ఎలా అడ్డుకుంటుదో చూడాలి.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (కీపర్), టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, నాథన్ ఎల్లిస్, మొహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్
LIVE Cricket Score & Updates
-
పంజాబ్ కింగ్స్‌దే విజయం
చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ టీం 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి సాధించింది.
-
నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
దీపక్ హుడా (3) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. శివమ్ మావి బౌలింగ్‌లో త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 16.3 ఓవర్లో 4 వికెట్లకు 134 పరుగులు చేసింది. విజయానికి 21 బంతుల్లో 32 పరుగులు కావాలి.
-
-
మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్
మక్రాం (18) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. నరైన్ బౌలింగ్‌లో శుభ్మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 15.3 ఓవర్లో 3 వికెట్లకు 129 పరుగులు చేసింది. విజయానికి 27 బంతుల్లో 37 పరుగులు కావాలి.
-
అర్థ సెంచరీ పూర్తి చేసిన రాహుల్
166 పరుగుల లక్ష్యంతో పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు బలమైన పునాది వేశారు. ఓపెనర్ రాహుల్ సంయమనంతో ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్త చేశాడు. 42 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
-
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
పూరన్ (12) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్‌లో శివం మావికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
-
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
మయాంక్ అగర్వాల్ (40 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 3 సిక్సులు) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్‌లో మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 70 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెర పడింది.
-
అర్థ సెంచరీ దాటిన ఓపెనర్ల భాగస్వామ్యం
166 పరుగుల లక్ష్యంతో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ఛేజింగ్ మొదలు పెట్టారు. మయాంక్ అగర్వాల్ 32, కేఎల్ రాహుల్ 17 పరుగులతో కీలకమైన అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి ఇన్నింగ్స్‌లో 2 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి.
-
6 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 46/0
6 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ టీం వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ 31, కేఎల్ రాహుల్ 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
3 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 25/0
3 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ టీం వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ 17, కేఎల్ రాహుల్ 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
మొదలైన పంజాబ్ ఛేజింగ్
166 పరుగుల లక్ష్యంతో పంజాబ్ కింగ్స్ ఛేజింగ్ మొదలు పెట్టింది. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు.
-
పంజాబ్ టార్గెట్ 166
కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 166 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
-
6వ వికెట్ కోల్పోయిన కోల్‌కతా
టిం (2) రూపంలో కేకేఆర్ టీం 6వ వికెట్‌ను కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు.
-
5వ వికెట్ కోల్పోయిన కోల్‌కతా
నితీష్ రాణా (31 పరుగులు, 18 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో 5వ వికెట్‌ను కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో మయాంక్‌కు క్యాచ్ ఇచ్చి పెవలియన్ చేరాడు.
-
4వ వికెట్ కోల్పోయిన కోల్‌కతా
కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (2) రూపంలో 4వ వికెట్‌ను కోల్పోయింది.
-
కేకేఆర్ తరపున తొలి 5 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్
జాక్వెస్ కాలిస్ – 193 వెంకటేశ్ అయ్యర్ – 193 బ్రెండన్ మెకల్లమ్ – 189 క్రిస్ లిన్ – 176
-
3వ వికెట్ కోల్పోయిన కోల్‌కతా
వెంకటేష్ అయ్యర్ (67 పరుగులు, 49 బంతులు, 9 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం రెండో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
వెంకటేష్ అయ్యర్ అర్థ సెంచరీ
కేకేఆర్ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 39 బంతుల్లో 7 ఫోర్ల సహయంతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
-
2వ వికెట్ కోల్పోయిన కోల్‌కతా
త్రిపాఠి (34) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం రెండో వికెట్ కోల్పోయింది. రవి బౌలింగ్‌లో హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
9 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 73/1
9 ఓవర్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 42, రాహుల్ త్రిపాఠి 22 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
6 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 48/1
6 ఓవర్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 27, రాహుల్ త్రిపాఠి 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
శుభ్మన్ గిల్ (7) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం తొలి వికెట్ కోల్పోయింది. అర్షీదీప్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
-
2 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 17/0
రెండు ఓవర్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ 7, వెంకటేష్ అయ్యర్ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
ప్లేయింగ్ ఎలెవన్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (కీపర్), టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, నాథన్ ఎల్లిస్, మొహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్
-
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
కీలకమైన మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ టీం.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.
-
కేకేఆర్‌దే ఆధిపత్యం
ఇరు జట్ల మధ్య మొత్తం 28 మ్యాచులు జరిగాయి. ఇందులో కేకేఆర్ టీం 19, పంజాబ్ కింగ్స్ టీం 9 మ్యాచుల్లో గెలుపొందాయి. చివరిసారిగా ఈ రెండు టీం తలపడినప్పుడు కేేకేఆర్ టీం అహ్మదాబాద్‌లో సులభంగా విజయం సాధించింది.
-
పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌కు అంతా సిద్ధం
Hello & welcome from Dubai for Match 4⃣5⃣ of the #VIVOIPL ?
The @Eoin16-led @KKRiders square off against @klrahul11‘s @PunjabKingsIPL. ? ?
Which team will come out on top tonight❓ #KKRvPBKS pic.twitter.com/Mz9GeW9FN0
— IndianPremierLeague (@IPL) October 1, 2021
Published On - Oct 01,2021 6:47 PM