AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravichandran Ashwin: దినేష్ కార్తీకే అసలైన అపరాధి.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.. అశ్వి‎న్‎కు అండగా మాజీలు

సెప్టెంబర్ 28న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. రిషబ్ పంత్‎కు బాల్ తగిలినా సింగిల్ ప్రయత్నచడం వివాదంగా మారింది...

Ravichandran Ashwin: దినేష్ కార్తీకే అసలైన అపరాధి.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.. అశ్వి‎న్‎కు అండగా మాజీలు
Virender
Srinivas Chekkilla
|

Updated on: Oct 01, 2021 | 6:06 PM

Share

సెప్టెంబర్ 28న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. రిషబ్ పంత్‎కు బాల్ తగిలినా సింగిల్ ప్రయత్నచడం వివాదంగా మారింది. ఇదే విషయమై కేకేఆర్ కెప్టెన్ ఇయన్ మోర్గాన్, టిమ్ సౌథి అశ్విన్‎పై కామెంట్ చేశారు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా అశ్విన్ క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించారు. దీనిపై స్పందంచిన అశ్విన్ వరుస ట్వీట్ల ద్వారా అక్కడ జరిగింది వివరించారు. తాజాగా ఈ వివాదంపై భారత మాజీ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్ స్పందించారు. కేకేఆర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‎ను కార్నర్ చేస్తూ మాట్లాడాడు. ఈ వివాదంలో దినేష్ సరిగా వ్యవహరించలేదని చెప్పాడు. అతను సరిగా వ్యవహరిస్తే ఈ వివాదం జరిగేది కాదన్నారు. రాహుల్ త్రిపాఠి బంతిని విసిరాడు.. అది రిషబ్ పంత్‌కి తగిలి బాల్ పక్కకు వెళ్లిపోటంతో అశ్విన్ పరుగు కోసం పిలిచాడు. ఇదీ మోర్గాన్ ఇష్టముండకపోవచ్చన్నారు.

పంజాబ్ కింగ్స్‌తో ఆడిన రోజుల్లో జరిగిన సంఘటనను సెహ్వాగ్ వివరించాడు. “నేను పంజాబ్ తరఫున ఆడుతున్నప్పుడు కూడా, అశ్విన్ మాక్స్‌వెల్‌ని అవుట్ చేశాడు. దుమ్మును పైకి లేపాడు. నాకు అది నచ్చలేదు. అది ఆట స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పడానికి నేను బహిరంగంగా బయటకు రాలేదని చెప్పారు. మైదానంలో ఏం జరిగినా అక్కడే వదిలి పెట్టాలని సూచించారు. ఇలా విషయాలు బయటకు రావడం మొదలుపెడితే, ప్రతి మ్యాచ్‌ ఏదో ఒక గందరగోళానికి కారణమవుతుందని సెహ్వాగ్ చెప్పారు.

ఈ ఘటనలో అశ్విన్‌కు వంద శాతం తన మద్దతు ఉంటుందని మాజీ ఆటగాడు గౌతమ్ గంబీర్ స్పష్టం చేశాడు. నిబంధనలకు లోబడే అశ్విన్‌ అలా ప్రవర్తించాడని, అందులో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నాడు. ‘‘చాలా మంది ఈ విషయం గురించి అనవసరంగా మాట్లాడుతున్నారు. వాళ్లకు ఇందులో అసలు ప్రమేయం ఎందుకు? బహుశా సోషల్‌ మీడియా యూజర్లను పెంచుకునే క్రమంలో ఇలా మాట్లాడుతున్నారేమోనని అనిపిస్తోంది. ఇలా చేయడంలో ఏమాత్రం అర్థం లేదు. అశ్విన్‌ కచ్చితంగా సరైన పనే చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పఠాన్ కూడా 2019 ప్రపంచ కప్ వివాదాన్ని గుర్తు చేశారు. భారత ఆటగాళ్లు అశ్విన్‌కు పూర్తిగా మద్దతు ఇస్తారని చెప్పారు. అగార్కర్ కూడా అశ్విన్‎కు మద్దతు తెలిపారు.

Read Also.. Watch Video: వికెట్ల కోసం తంటా.. స్లిప్స్‌లో ఎనిమిది మంది.. ఫీల్డింగ్ చూస్తే ఆశ్చర్యపోతారంటే!