- Telugu News Photo Gallery Cricket photos Ipl points table 2021 standings ranking orange cap purple cap after kkr and punjab match
IPL 2021 Points Table: ఉత్కంఠగా కొనసాగుతోన్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఏయే జట్లు ఉన్నాయంటే..?
IPL 2021 Points Table: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేస్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. జట్ల మధ్య పోటీ చివరి
Updated on: Oct 02, 2021 | 7:36 AM

IPL 2021 Points Table: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేస్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. జట్ల మధ్య పోటీ చివరి అంకానికి చేరుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై.. పంజాబ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన పోరులో కేకేఆర్‌పై పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు తొమ్మిది విజయాలను దక్కించుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 18 పాయింట్లతో దూసుకుపోతోంది.

ఇక 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 8 విజయాలను సొంతం చేసుకొని 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్‌లకు గాను 7 గెలిచి.. 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

కోల్‌కతా 12 మ్యాచ్‌లకు గాను 5 గెలిచి 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. పంజాబ్ 12 మ్యాచ్‌లు ఆడి ఐదు గెలిచి ఐదో స్థానంలో కొనసాగుతోంది.

11 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ 6వ స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలను సొంతం చేసుకొని 7వ స్థానంలో నిలిచింది. 11 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలను సొంతం చేసుకొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.

ఇక సీజన్‌లో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన వారికి అందించే ఆరంజ్, పర్పుల్ క్యాప్ విభాగంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిన్నటివరకు ముందున్న శిఖర్ ధావన్‌ను వెనక్కు నెట్టి.. కేఎల్ రాహుల్ అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడిగా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం పంజాబ్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 489 పరుగులతో ముందంజలో ఉన్నాడు. 26 వికెట్లతో బెంగళూరు జట్టుకు చెందిన హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు.




