World Vegetarian Day 2021: శాకాహారులుగా మారితే 5 అద్భుత ప్రయోజనాలు..! ఏంటో తెలుసుకోండి..
World Vegetarian Day 2021: ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచం ప్రపంచ శాఖాహారుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సరైన ఆహారం వ్యక్తి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
World Vegetarian Day 2021: ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచం ప్రపంచ శాఖాహారుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సరైన ఆహారం వ్యక్తి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థని అభివృద్ధి చేయడంలో తోడ్పడుతుంది. శాఖాహారం అనేది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. శాకాహారం తినడం వల్ల కలిగే 5 ప్రయోజనాలను తెలుసుకుందాం.
1. సుదీర్ఘ మైన జీవితం శాకాహారం తీసుకుంటే సుదీర్ఘ మైన జీవితాన్ని గడపవచ్చు. అంతేకాదు ఆరోగ్యంగా ఉంటారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించబడిన కథనం ప్రకారం.. శాకాహారుల కంటే మాంసాహారులలో వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపిస్తాయని తేల్చారు. అంతేకాదు వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
2. బరువు నియంత్రణ అధ్యయనాల ప్రకారం.. శాఖాహారం బరువు సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొవ్వు నిల్వ ఉండకుండా చూసుకుంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో బరువు పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది శాకాహారిగా మారడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. వయసుతో పాటు వచ్చే వ్యాధులకు దూరంగా ఉంటారు. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. గ్యాస్ సమస్యలు, బరువు పెరగడం వంటివి ఉండవు.
4. గుండె సమస్యలు దరిచేరవు శాఖాహార ఆహారం స్ట్రోక్ వంటి గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు లివర్ చెడిపోకుండా కాపాడుతుంది.
5. విటమిన్లు, ప్రోటీన్లు శాకాహారంతో కూడా మాంసాహారంలో దొరికే విటమిన్లు, ప్రొటీన్లను తీసుకోవచ్చు. అంతేకాదు మాంసాహారం వల్ల చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది. కానీ మొక్కల తిండి తింటే ఈ సమస్య ఉండదు. అంతేకాదు నిత్య యవ్యనంగా ఉండవచ్చు.