AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rusk Halwa: రస్కులతో హల్వా.. ఆహా అదిరిపోతుంది అంతే..

హల్వా అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. హల్వా చాలా రుచిగా ఉంటుంది. అందుకే అందరూ ఇష్టపడతారు. ఎన్నో రకాల పదార్థాలతో హల్వాను తయారు చేసుకోవచ్చు. బ్రెడ్‌తో చేసే హల్వా అందరికీ తెలుసు. కానీ రస్కులతో చేసే ఈ హల్వా రుచిగానే ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి..

Rusk Halwa: రస్కులతో హల్వా.. ఆహా అదిరిపోతుంది అంతే..
Rusk Halwa
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 10, 2024 | 10:03 PM

Share

బ్రెడ్‌తో చేసే డబుల్ కా మీటా స్వీట్ రెసిపీ గురించి అందరికీ తెలుసు. ఇంట్లో కూడా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. కేవలం బ్రెడ్‌తోనే కాకుండా రస్కులతో కూడా హల్వా తయారు చేయవచ్చు. ఇది కూడా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుంది. పెద్దగా సమయం కూడా పట్టదు. కేవలం 20 నిమిషాల్లో హల్వా సిద్ధం అవుతుంది. ఇది కూడా రుచిగానే ఉంటుంది. పిల్లలు అడిగినప్పుడు సింపుల్‌గా ఇంట్లోనే ఉండే వాటితో ఈ హల్వా తయారు చేయవచ్చు. మరి రస్కులతో హల్వా ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రస్కుల హల్వాకి కావాల్సిన పదార్థాలు:

రస్కులు, పంచదార, యాలకుల పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్.

రస్కుల హల్వా తయారీ విధానం:

ముందుగా రస్కులను ఒక గిన్నెలో మరీ పొడిగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించు కోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో రస్కుల పొడి వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి వేగాక పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత ఇదే పాన్‌లో నీళ్లు, పంచదార వేసి పాకం వచ్చే దాకా మరిగించుకోవాలి. పాకం మరుగుతున్నప్పుడు యాలకు పొడి వేసి కలుపుకోవాలి. ఈ సమయంలో వేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు పాకం మరింత దగ్గరగా జిగురుగా మారుతుంది. ఈ సమయంలో రస్కుల పొడి వేసి చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి. మాడకుండా చూసుకోండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్‌ కూడా వేసి కలుపుకోవాలి. అంతే ఎంత రుచిగా ఉండే రస్కుల హల్వా సిద్ధం. తక్కువ సమయంలోనే ఇది రెడీ అయిపోతుంది. రుచిగా కూడా ఉంటుంది. కావాలి అనుకుంటే కుంకుమ పువ్వును వేసుకుంటే ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది.

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి