Kuboos: కుబూస్‌ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..
కుబూస్ అంటే చాలా మందికి షవార్మా గుర్తుకు వచ్చి ఉంటుంది. కుబూస్‌తో తింటే షవార్మా మరింత రుచిగా ఉంటుంది. కుబూస్ అనేది ఒక అరబిక్ డిష్. దుబాయ్‌లో వీటిని ఎక్కువగా చేసుకుని తింటారు. వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కుబూస్‌ని వేటితో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్ రెసిపీతో తింటే అదుర్స్ అంతే..
కుబూస్ అంటే చాలా మందికి షవార్మా గుర్తుకు వచ్చి ఉంటుంది. కుబూస్‌తో తింటే షవార్మా మరింత రుచిగా ఉంటుంది. కుబూస్ అనేది ఒక అరబిక్ డిష్. దుబాయ్‌లో వీటిని ఎక్కువగా చేసుకుని తింటారు. వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కుబూస్‌ని వేటితో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్ రెసిపీతో తింటే అదుర్స్ అంతే. సండే వచ్చిందంటే ఎలాగో నాన్ వెజ్ కర్రీస్ చేసుకుంటాం. అప్పుడు వీటిని కూడా చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ కుబూస్‌ని ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కుబూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
మైదా పిండి, ఈస్ట్, పంచదార, ఉప్పు, వేడి నీళ్లు, పాల పొడి.
కుబూస్ తయారీ విధానం:
ముందుగా కుబూస్ తయారు చేయడానికి పిండి కలుపుకోవాలి. మీకు కావాల్సినంత పిండిని ఓ గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ వేయాలి. వేడి నీళ్లు కొద్దిగా తీసుకుని అందులో ఒక స్పూన్ షుగర్, కొద్దిగా ఈస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత మిక్స్ చేసిన ఈస్ట్ మిశ్రమాన్ని.. పిండిలో వేసి చపాతీ పిండిలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ పిండిని బాగా కలిపితే కుబూస్ మెత్తగా వస్తాయి.
చేతితో బాగా కలిపి.. ఓ గిన్నెలో వేసి ఆయిల్ రాసి మూత పెట్టాలి. కనీసం నాలుగు గంటల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండి మొత్తం మిక్స్ చేయాలి. ఈ పిండిని ముద్దలుగా చేసి కుబూస్ తయారు చేసుకోవాలి. అయితే చపాతీల్లా మరీ పల్చగా కాకుండా.. కాస్త లావుగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకుని.. మీడియం మంట మీద వేడి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కుబూస్ సిద్ధం.