Bread Masala: పిల్లలు ఇష్టపడీ మరి లాగించే స్నాక్.. ‘బ్రెడ్ మసాలా’

ఇంట్లో పిల్లలు ఉన్నారంటే.. సాయంత్రం కాగానే తినడానికి ఏదైనా చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. అప్పటికప్పుడు పిల్లలకు నచ్చే విధంగా.. ఈజీగా అయ్యే స్నాక్ ఇది. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకు తప్పకుండా నచ్చుతుంది. చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలోనే ఈ స్నాక్ ప్రిపేర్ అవుతుంది. ఈ స్నాక్ బ్రెడ్‌తో తయారు చేస్తారు. ఇప్పటికే బ్రెడ్‌తో ఎన్నో రకాల రెసిపీలు తెలుసుకున్నాం. బ్రెడ్‌తో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలకు లంచ్ బాక్స్‌లో కూడా పెట్టి..

Bread Masala: పిల్లలు ఇష్టపడీ మరి లాగించే స్నాక్.. 'బ్రెడ్ మసాలా'
Bread Masala
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 03, 2024 | 8:30 PM

ఇంట్లో పిల్లలు ఉన్నారంటే.. సాయంత్రం కాగానే తినడానికి ఏదైనా చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. అప్పటికప్పుడు పిల్లలకు నచ్చే విధంగా.. ఈజీగా అయ్యే స్నాక్ ఇది. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకు తప్పకుండా నచ్చుతుంది. చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలోనే ఈ స్నాక్ ప్రిపేర్ అవుతుంది. ఈ స్నాక్ బ్రెడ్‌తో తయారు చేస్తారు. ఇప్పటికే బ్రెడ్‌తో ఎన్నో రకాల రెసిపీలు తెలుసుకున్నాం. బ్రెడ్‌తో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలకు లంచ్ బాక్స్‌లో కూడా పెట్టి ఇవ్వొచ్చు. మరి ఈ టేస్టీ బ్రెడ్ మసాలా ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బ్రెడ్ మసాలాకు కావాల్సిన పదార్థాలు:

బ్రెడ్, పచ్చి మిర్చి, పచ్చి మిర్చి, జీలకర్ర, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, టమాటా కెచప్.

బ్రెడ్ మసాలా తయారీ విధానం:

ముందుగా బ్రెడ్ స్లైసెస్‌ని వేయించి పెట్టుకోవాలి. ఇందుకు బ్రెడ్ కట్ చేసి పక్కన పెట్టండి. ఆ తర్వాత పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ ఆయిల్ వేసి వేడెక్కాక.. బ్రెడ్ స్లైసెస్‌ వేసి వేయించుకోవాలి. చిన్న మంటపై ఇవి వేయించాలి లేదంటే మాడిపోతాయి. ఇలా వేగిన బ్రెడ్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కావాలి అనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక.. జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగాక ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి కలర్ మారేంత వరకూ ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఆ నెక్ట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి.. మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి ఓ రెండు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా టమాటా కెచప్ వేసి స్పైసెస్‌ని అడ్జెస్ట్ చేయాలి. ఇప్పుడు చివరిగా బ్రెడ్ ముక్కలు, కొత్తి మీర వేసి మసాలాలు అంతా పట్టేలా.. ఓ పది నిమిషాలు వేయించాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ బ్రెడ్ మసాలా రెడీ. ఇది మీ పిల్లలకు తప్పకుండా నచ్చుతుంది.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ