AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!

2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇది చాలా పవర్ ఫుల్ సూర్యగ్రహణం అంటున్నారు పండితులు. ఈ సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. అంతే కాకుండా ఇది అన్ని సూర్య గ్రహణాలకంటే భిన్నంగా రింగ్‌లా ఏర్పడనుంది. కాగా, దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jan 19, 2026 | 11:43 AM

Share
2026లో మొదటి సారి ఏర్పడే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఇది ఫిబ్రవరి 17న సంభవిస్తుంది. దృశ్య పరంగా కూడా అద్భుతమైన ఖగోళ సంఘటనను సూచిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా దీనిని వార్షిక సూర్య గ్రహణం అనికూడా పిలుస్తారంట.  ఎందుకంటే? ఇది ఎప్పుడూ ఏర్పడే సూర్య గ్రహణం మాదిరి కాకుండా, గుడ్రంగా రింగ్‌లా ఏర్పడి, దాని చుట్టూ అగ్ని వలయం ఏర్పడుతుందంట. అందుకే దీనిని అగ్ని వలయం గ్రహణం అని కూడా పిలుస్తారు.

1 / 5
సూర్య గ్రహణం అంటే చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్యలో వచ్చినప్పుడు ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడు పాక్షికంగా లేదా పూర్తిగా కనిపించడు, ఈ సమయాన్ని సూర్య గ్రహణం అంటారు. ఇది అమావాస్య రోజు మాత్రమే జరుగుతుంది. ఇక చంద్రుడు సూర్యుడి ముందు నుంచి వెళ్లినప్పుడు ఏర్పడే సూర్య గ్రహణం కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో సూర్యుని చుట్టూ ఒక ప్రకాశవంతమైన వలయం ఏర్పడుతుందంట.

2 / 5
అంటే, చంద్రుడు, సూర్యుడికి, భూమికి  మధ్యలో వెళ్లినప్పుడు,  ఇది భూమికి చాలా దూరంలో లేదా చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఈ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు భూమికి దూరంగా ఉన్నందున, అది సూర్యుడి కంటే చిన్నదిగా కనిపిస్తుంది. అంతేకాకుండా సూర్యుడు పూర్తిగా కప్పబడి ఉండడు.అందుకే  ఈ సమయంలో ఏర్పడే సూర్య గ్రహణాన్నే రింగ్ ఫైర్ లేదా కంకణాకార సూర్యగ్రహణం అంటారు.

3 / 5
కంకణాకార సూర్యగ్రహణం, ఫిబ్రవరి 17, 2026లో ఏర్పడుతుంది.  అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకారం, ఈ సూర్య గ్రహణం, దాని  పాక్షిక దశతో సుమారు 09:56 UTCకి ప్రారంభమై, సుమారు 12:12 UTCకి గరిష్ట కవరేజుకు చేరుకుంటుంది. ఇది దాదాపు 14:27 UTCకి ముగుస్తుంది.

4 / 5
ఇక ఫిబ్రవరి 17న ఏర్పడే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదంట. ఈ గ్రహణం అంటార్కిటికా మీదుగా మాత్రమే వెళ్తుందని, అందువలన భారత దేశంలో ఉన్నవారు ఈ సమయంలో గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక ఈ సూర్య గ్రహణం దక్షిణ హిందూ మహాసముద్రంలో ప్రారంభమైన తర్వాత, ఈ వార్షిక మార్గం అంటార్కిటికా తీర ప్రాంతాలను దాటుతుంది. ఇది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ముగుస్తుంది.

5 / 5