AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్.. ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే అవాక్కే..!

చొక్కా ధరించినప్పుడు ముందు భాగంలో, స్లీవ్‌ల దగ్గర బటన్‌లను ఉంచుతారు. కానీ, చాలా మంది గమనించని ఒక చిన్న విషయం ఏమిటంటే కొన్ని చొక్కాల కాలర్‌పై చిన్న బటన్‌లు ఉంటాయి. ఇవి కేవలం స్టైల్ కోసమే అని మీరు అనుకుంటున్నారా? లేదా వాటి వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? నిజానికి, ఈ చిన్న బటన్లు చొక్కాకు స్టైల్‌ను ఇస్తాయి. అంతే కాకుండా కొన్ని ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్.. ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే అవాక్కే..!
Shirt Collar Button
Jyothi Gadda
|

Updated on: Jan 19, 2026 | 8:04 AM

Share

నిత్యం మన దైనందిన జీవితంలో మనం అనేక విషయాలను చూస్తాము. కానీ, మనకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగించే లేదా హాని కలిగించే వాటిపై మాత్రమే ఎక్కువగా దృష్టి పెడతాము. మిగిలిన విషయాలను పట్టించుకోము. చాలా తక్కువ మంది మాత్రమే చిన్న చిన్న విషయలను కూడా తెలుసుకోవాలనుకుంటారు. ఫ్యాషన్ ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. మనం ట్రెండీ దుస్తులు, స్టైలిష్ షర్టులు ధరిస్తాము. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చొక్కాలు, ప్యాంటు తప్పనిసరి. మగవారు మాత్రమే కాదు, మహిళలు కూడా చొక్కా ప్యాంట్లు ధరిస్తున్నారు. కానీ మీరు ప్రతిరోజూ ధరించే చొక్కాను ఎప్పుడైనా గమనించారా! చొక్కా కాలర్ దగ్గర చిన్న బటన్ ఎందుకు ఉంటుంది? అది కేవలం స్టైల్ కోసమే అని మీరు అనుకుంటున్నారా..? కాదు..దాని ఉపయోగాలు తెలుసుకుందాం!

చాలా మంది ఈ బటన్లు కేవలం ఫ్యాషన్ కోసమే అని అనుకుంటారు. కానీ నిజానికి, వాటి వెనుక ఒక చరిత్ర ఉంది. అవి ఫ్యాషన్‌గా ఉండటమే కాకుండా, కొంతమందికి ప్రత్యేక భద్రతను అందించడానికి కూడా ఉపయోగపడతాయి. గుర్రాలపై స్వారీ చేసే సైనికులు, అథ్లెట్ల అవసరాల నుండి ఈ డిజైన్ పుట్టుకొచ్చింది. నేడు మనం చూసే చాలా బ్రాండెడ్ చొక్కాలు కాలర్ పైభాగంలో రెండు చిన్న బటన్‌లను కలిగి ఉంటాయి. వీటిని బటన్-డౌన్ కాలర్ బటన్లు అని పిలుస్తారు. కాలర్‌ను గట్టిగా క్రిందికి ఉంచడం వాటి ప్రధాన విధి. అవి కాలర్‌ను ఒకే చోట స్టివ్‌గా నిలబడి ఉంచడంలో చాలా సహాయపడతాయి. ఇది మిమ్మల్ని స్మార్ట్‌గా చూపిస్తుంది.

ఈ బటన్-డౌన్ కాలర్ డిజైన్ మూలం ఈక్వెస్ట్రియన్ దుస్తుల నుండి వచ్చింది. గతంలో పోలో ఆటగాళ్ళు, గుర్రపు స్వారీ చేసేవారు ప్రత్యేక దుస్తులు ధరించేవారు. ముఖ్యంగా ఐవీ లీగ్ కాలేజ్‌ ఆటగాళ్ళు పోలో మ్యాచ్‌ల సమయంలో బటన్-డౌన్ కాలర్ చొక్కాలను ఉపయోగించారు. గుర్రంపై వేగంగా స్వారీ చేసేటప్పుడు బట్టలు శరీరానికి సరిపోయేలా ఉండటం ముఖ్యం. గుర్రంపై స్వారీ చేసేటప్పుడు గాలి ముఖంపై బలంగా వీస్తుంది. అప్పుడు చొక్కా కాలర్ పైకి లేచి ముఖానికి తాకుతుంది. దీని వల్ల దృష్టి పక్కదారి పడుతుంది. ఈ సమస్యను నివారించేందుకు కాలర్ చివరలకు చిన్న బటన్‌లను యాడ్ చేశారు. అవి కాలర్‌ను కిందికి బిగిగా ఉంచి, రైడర్లకు మరింత సౌకర్యం, భద్రతను అందించాయి. ఆ కాలంలో ఇది ఒక ప్రయోగంలా మొదలైనప్పటికీ, చాలా ఉపయోగకరంగా మారింది.

ఇవి కూడా చదవండి

కాలం మారుతున్న కొద్దీ ఈ డిజైన్ ఫ్యాషన్‌గా మారింది. నేటికీ, బటన్-డౌన్ కాలర్‌లతో కూడిన షర్టులు, టీ-షర్టులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, చాలా మంది వాటి అసలు ఉపయోగం తెలియకుండానే, కేవలం స్టైల్ కోసం వాటిని ధరిస్తారు. ఒక చిన్న అవసరం నుండి ఉద్భవించిన ఈ డిజైన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్‌లో ముఖ్యమైన భాగంగా మారింది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్
తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్
ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?
ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?
ముద్రా లోన్ పథకంపై కేంద్రం బిగ్ డెసిషన్..
ముద్రా లోన్ పథకంపై కేంద్రం బిగ్ డెసిషన్..