Kitchen Hacks: ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్ ట్రిక్.. ఇలా చేశారంటే..
ఇంట్లో నెయ్యి తయారు చేయాలంటే చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. ఎన్నో రోజులు ప్రయత్నిస్తే కూడా చాల తక్కువ నెయ్యిని తయారు చేస్తారు. కాబట్టి. అలాంటి వారి కోసం ఇంటర్‌నెట్‌లో ఒక సూపర్ ట్రిక్ వైరల్ అవుతోంది. దీనిని చాలా మంది ఫుడ్ వ్లాగర్లు ఫాలో అవుతున్నారు.. ఈ ట్రిక్‌లో క్రీమ్ నుండి ఒకసారి నెయ్యిని తీసిన తర్వాత, మిగిలిన పదార్థం నుండి కూడా మళ్లీ నెయ్యిని సులభంగా తీయవచ్చు. ఇది వింతగా అనిపిస్తే, ఈ పద్ధతి ఏంటో మీరు కూడా అనుసరించండి..మీకే తెలుస్తుంది..

ఇంట్లో తయారు చేసిన నెయ్యి స్వచ్ఛత గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదు. కానీ, చాలా మంది మహిళలు ఇంట్లో నెయ్యిని తయారు చేయటానికి బద్ధకిస్తుంటారు. ఎందుకంటే, క్రీమ్ నుండి నెయ్యిని తీయడానికి ఎక్కువ సమయం పడుతుందని. తీసిన నెయ్యి కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి. అలాంటి వారి కోసం ఇంటర్‌నెట్‌లో ఒక సూపర్ ట్రిక్ వైరల్ అవుతోంది. దీనిని చాలా మంది ఫుడ్ వ్లాగర్లు ఫాలో అవుతున్నారు.. ఈ ట్రిక్‌లో క్రీమ్ నుండి ఒకసారి నెయ్యిని తీసిన తర్వాత, మిగిలిన పదార్థం నుండి కూడా మళ్లీ నెయ్యిని సులభంగా తీయవచ్చు. ఇది వింతగా అనిపిస్తే, ఈ పద్ధతి ఏంటో మీరు కూడా అనుసరించండి..మీకే తెలుస్తుంది..
క్రీమ్ నుండి నెయ్యిని తయారు చేసేందుకు ముందుగా పెరుగును ఉపయోగించే విధానాన్ని అనుసరించండి. క్రీమ్ కొద్దిగా వేడెక్కిన తర్వాత, కొద్దిగా పెరుగు వేసి 3-4 గంటలు అలాగే ఉంచండి. తరువాత, క్రీమ్‌ను బాగా కొట్టండి. వెన్న వేరు కావడం ప్రారంభించినప్పుడు, దానిని తీసివేయండి. వెన్నను ప్రత్యేక పాత్రలో ఉంచి రెండు లేదా మూడు నీటితో శుభ్రం చేసుకోండి. తీసిన వెన్నను స్టవ్ మీద ఉంచి, నిరంతరం కలుపుతూ నెయ్యిని తీయండి. నెయ్యి తీసిన తర్వాత, దానిని వడకట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు, మిగిలిన ఈ గోధుమ రంగు భాగం నుండి నెయ్యిని మళ్ళీ తీయవచ్చు. ఈ ట్రిక్ మీకు కూడా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.
నెయ్యి తీసిన తర్వాత అడుగున మిగిలిపోయిన గోధుమ రంగు భాగాన్ని తిరిగి నెయ్యి తయారు చేసిన పాత్రలోనే ఉంచి, చల్లటి నీరు కలపండి. తరువాత ఆ పాత్రను 2-3 గంటలు ఫ్రీజర్‌లో ఉంచండి. ఫ్రీజర్‌లో ఉంచినప్పుడు నెయ్యి నీటి పైకి తేలుతూ గట్టిపడుతుంది. ఒక చెంచాతో దాన్ని బయటకు తీయండి. ఈ ఘనీభవించిన నెయ్యిని గ్యాస్ మంట మీద కరిగించి రెండు నిమిషాలు ఉడికించి, ఒక సీసాలో నిల్వ చేసుకోండి.
ఇలా ఒకసారి నెయ్యిని తీసిన తర్వాత మిగిలిన గోధుమ భాగంలో పేరుకుపోయిన నెయ్యి కూడా సులభంగా బయటకు వస్తుంది. ఇలా క్రీమ్ నుండి నెయ్యిని తీసే ప్రక్రియ అప్పుడు కంప్లీట్ అవుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




