AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే..

బరువు తగ్గడం కేవలం తక్కువ తినడం కాదు, సరైన ఆహారం తీసుకోవడం. ఊబకాయం తగ్గాలంటే జీవక్రియను వేగవంతం చేసే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలి. నిమ్మ, తేనెతో గోరువెచ్చని నీటితో రోజు ప్రారంభించండి. ఇడ్లీ, ఉప్మా, మొలకలు వంటి పోషక అల్పాహారం తినండి. భోజనంలో ఆకుకూరలు, తక్కువ అన్నం, సలాడ్ చేర్చండి. సాయంత్రం నట్స్, పండ్లు తీసుకోండి. రాత్రి తేలికపాటి భోజనం, వ్యాయామం, నీరు, నిద్ర బరువు తగ్గిస్తాయి. జంక్ ఫుడ్ మానండి.

Weight Loss Tips: ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే..
Weight Loss
Jyothi Gadda
|

Updated on: Jan 19, 2026 | 7:41 AM

Share

బరువు తగ్గడం అంటే తక్కువ తినడం మాత్రమే కాదు, సరైన ఆహారం తీసుకోవడం కూడా. నేటి జీవనశైలిలో సరైన పోషకాలు లేని ఆహారం కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. సరైన పద్ధతిలో, సరైన ఆహారపు అలవాట్లను పాటిస్తూ ఉంటే..మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించండి. దానికి కొంచెం నిమ్మరసం, తేనె యాడ్‌ చేసుకోండి. దీని వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపి మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీ తాగడం మంచిది. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ మంచి పోషకాలతో నిండి ఉండాలి. వేయించిన పూరీలు, వడలకు బదులుగా ఇడ్లీ, ఉప్మా లేదా ఓట్స్‌ను తీసుకోండి. మొలకెత్తిన ధాన్యాలు శరీరానికి అవసరమైన ప్రోటీన్‌లను అందిస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేయటం వల్ల మధ్యాహ్నం ఆకలిగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యం. మీ భోజనంలో తెల్ల బియ్యం మొత్తాన్ని తగ్గించి, ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వండి. పాలిష్ చేయని బియ్యం, జొన్న రొట్టెలు తినడం మంచిది. భోజనానికి ముందు గ్రీన్ బఠానీలు, క్యారెట్లు, కీర వంటి వాటితో సలాడ్‌ తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. మీరు తక్కువ తింటారు. క్రమం తప్పకుండా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.

సాయంత్రం ఆకలిగా అనిపించినప్పుడు చిప్స్, బిస్కెట్లు తినడం మానుకోండి. బదులుగా, కొన్ని బాదం, వాల్‌నట్స్ లేదా ఒక పండు ముక్క తినండి. ఇది రాత్రి భోజనం వరకు మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీలైనంత త్వరగా రాత్రి భోజనం ముగించాలి. రాత్రి 8 గంటల లోపు రాత్రి భోజనం చేయడం ముఖ్యం. రాత్రి తేలికపాటి భోజనం తినండి. మొక్కజొన్న గంజి లేదా సూప్ ఉత్తమ ఎంపికలు. రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకునే బదులు, కాసేపు నడవడం అలవాటు చేసుకోండి. ప్రోటీన్ సమృద్దిగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కండరాలు బలంగా ఉంటాయి, జీవక్రియ మెరుగవుతుంది. గుడ్లు, పప్పులు,టోఫు, చేపలు, చికెన్, పనీర్, యోగర్ట్ వంటి ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఈ ఫుడ్, శరీర బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వీలైనంత త్వరగా రాత్రి భోజనం ముగించాలి. రాత్రి 8 గంటల లోపు తినేయాలి. రాత్రి తేలికపాటి భోజనం చేయండి.. మొక్కజొన్న గంజి లేదా సూప్ వంటివి బెస్ట్‌. రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకునే బదులు, కాసేపు నడవడం అలవాటు చేసుకోండి. దీనితో పాటు, మీరు ప్రతిరోజూ కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగాలి.. మీరు ఈ డైట్ ప్లాన్‌లో తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా పాటిస్తూ ఉంటే.. ఫలితాలు చాలా త్వరగా కనిపిస్తాయి. వాకింగ్ చేయడం వలన ఫ్యాట్ మెటబాలిజం మెరుగవుతుంది, జీర్ణశక్తి పెరిగి, ఒత్తిడి తగ్గుతుంది. రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వలన శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి మంచి నిద్ర ఎంతో అవసరం. దీని వలన ఆకలి హార్మోన్స్ నియంత్రణలో ఉంటాయి.రోజుకు కనీసం 7 నుండి 9 గంటల నిద్రపోవడం మంచిది. చక్కెర, స్వీట్లు, జంక్ ఫుడ్‌ను పూర్తిగా నివారించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..