Chilli Chicken: ఆంధ్రా స్టైల్‌లో ఇలా చిల్లీ చికెన్ కర్రీ చేయండి.. అదుర్స్ అంతే!
చికెన్‌తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. చికెన్ ఆరోగ్యానికి మంచిది కూడా. ఇందులో ప్రోటీన్ అనేది మెండుగా ఉంటుంది. ఇది శరీర ఎదుగుదలకు చాలా మంచిది. చికెన్‌తో తయారు చేసే వంటల్లో చిల్లీ చికెన్ కూడా ఒకటి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఐటెమ్ చాలా బావుంటుంది. చిల్లీ చికెన్ కర్రీ.. అన్నం, రోటీ, పులావ్ ఎందులోకైనా చాలా బావుంటుంది. ఇది చేయడం కూడా ఈజీనే. వీకెండ్స్, స్పెషల్ డేస్‌లో ఈ కర్రీ చేసుకోవచ్చు. మరి ఈ చిల్లీ చికెన్ ఎలా తయారు చేస్తారు..
చికెన్‌తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. చికెన్ ఆరోగ్యానికి మంచిది కూడా. ఇందులో ప్రోటీన్ అనేది మెండుగా ఉంటుంది. ఇది శరీర ఎదుగుదలకు చాలా మంచిది. చికెన్‌తో తయారు చేసే వంటల్లో చిల్లీ చికెన్ కూడా ఒకటి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఐటెమ్ చాలా బావుంటుంది. చిల్లీ చికెన్ కర్రీ.. అన్నం, రోటీ, పులావ్ ఎందులోకైనా చాలా బావుంటుంది. ఇది చేయడం కూడా ఈజీనే. వీకెండ్స్, స్పెషల్ డేస్‌లో ఈ కర్రీ చేసుకోవచ్చు. మరి ఈ చిల్లీ చికెన్ ఎలా తయారు చేస్తారు? ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చిల్లీ చికెన్‌కి కావాల్సిన పదార్థాలు:
చికెన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తి మీర, పుదీనా, నిమ్మ రసం, జీడిపప్పు, బిర్యానీ దినుసులు, గరం మసాలా, ఆయిల్.
ఆంధ్రా స్టైల్ చిల్లీ చికెన్ తయారీ విధానం:
ముందుగా చికెన్‌ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, నిమ్మరసం వేసి ఓ గంటపాటైనా బాగా మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు మిక్సీలో అల్లం, వెల్లల్లి, జీడిపప్పు, కొత్తి మీర, పుదీనా వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ పాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసి జీలకర్ర వేయించుకోవాలి. నెక్ట్స్ బిర్యానీ దినుసులు కొద్దిగా వేసి వేయించాలి. ఇప్పుడు కరివేపాకు, ఉల్లి పాయ ముక్కలు వేసి కలర్ మారేంత వరకూ వేయించాలి. ఉల్లి పాయలు వేగాక.. చికెన్ వేసి బాగా వేయించాలి.
ఆ తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మాసాలా వేసి.. ఓ రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసి మరో పది నిమిషాల వరకూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. అంతే చివరిలో కొత్తి మీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ చిల్లీ చికెన్ వేటితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.