Andhra Pradesh: ఏపీలో వారికి సూపర్ ఛాన్స్.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు.. దరఖాస్తు ఇలా చేస్కోండి
ఏపీలోని మత్స్యకారుల కోసం ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం. ఈ పథకం కింద లబ్దిదారులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించుంది. మత్స్యకారులు మరణిస్తే కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించనుంది.

ఏపీలో మత్స్యకారుల కుటుంబాలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. మత్స్యకారుల కుటుంబాలకు అందించే బీమా సొమ్మును భారీగా పెంచింది. ఇప్పటివరకు మత్స్యకారులకు రూ.2 లక్షల బీమా అందిస్తుండగా.. ఇప్పుడు దీనికి ఏకంగా రూ.10 లక్షలకు పెంచింది. దీంతో మత్స్యకారులు ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబానికి రూ.10 లక్షల ఆర్దిక సాయం అందనుంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళతారు. కేవలం చేపల వేటపైనే ఆధారపడి వీళ్లు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. సముద్రంలో ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తూ ఉంటారు. దీంతో వీరికి రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా మత్స్యకారులు అండగా నిలవనుంది.
సముద్రంలో చేపల వేట అనేది ప్రమాదంతో కూడుకున్న విషయం. చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తూ మరణిస్తూ కుటుంబానికి దిక్కు లేకుండా పోతోంది. దీంతో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఇక నుంచి సహాజ మరణం లేదా ఇతర ప్రమాదాల వల్ల మత్స్యకారులు మరణించినా కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందిస్తారు. కార్మికశాఖ నుంచి వీటిని లబ్దిదారులకు అందిస్తారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఈ పథకం ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అర్హతలు ఇవే..
-ఏదైనా మత్స్యకార సహకార సంఘంలో సభ్యుడై ఉండాలి -చేపల వేట లైసెన్స్ తీసుకుని ఉండాలి -మత్స్యశాఖ వద్ద పేరు నమోదు చేసుకోవాలి -చేపల బోట్లల్లో పనిచేసేవారు కూడా అర్హులే -ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మత్స్యకార సహకార సంఘం ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి.
బీమా సొమ్ము ఎలా పొందాలంటే..?
ఈ పథకంలో చేరిన వ్యక్తి మరణించినప్పుడు సమీపంలోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో లేదా రైతు సేవా కేంద్రంలో కుటుంబసభ్యులు దరఖాస్తులు సమర్పించాలి. మరణించిన వ్యక్తి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, డెత్ సర్టిఫికేట్, పంచనామా పత్రం వంటి డాక్యుమెంట్స్ సమర్పించాలి. దీంతో అధికారులు నిర్ధారించి బీమా సొమ్మును కుటుంబానికి అందిస్తారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున సహాయం అందిస్తోంది. చేపల వేటకు ఉపయోగించే బోట్లు, వలలు, ఇంజిన్లు లాంటి వస్తువలను రాయితీపై అందిస్తోంది. మత్స్యకారులందరికీ ఈ పథకం మంచి అవకాశమని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఏమైనా అనుమానాలు ఉంటే మత్స్యశాఖ కార్యాలయాన్ని సందర్శించాలని సూచిస్తున్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
