మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో తెలుసా?
Magha Masam 2026: మాఘ మాసం జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుంది. మాఘ పురాణం ప్రకారం.. ఈ మాసంలో గంగా, యమునా, గోదావరి, కావేరి, నర్మదా, సింధు వంటి పుణ్య నదుల్లో స్నానం చేయడం వలన అపార పుణ్యం లభిస్తుంది. మాఘస్నానం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది.

హిందువులు మాఘ మాసం.. వైశాఖం, శ్రావణం, కార్తీక మాసంలానే ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మాఘ మాసం జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుంది. మాఘ పురాణం ప్రకారం.. ఈ మాసంలో గంగా, యమునా, గోదావరి, కావేరి, నర్మదా, సింధు వంటి పుణ్య నదుల్లో స్నానం చేయడం వలన అపార పుణ్యం లభిస్తుంది. చంద్రుడు మాఘ నక్షత్రంలో ఉండే మాసం మాఘం. మఘం అంటే యజ్ఞం అని అర్థం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఇలాంటి పవిత్ర క్రతువులు జరిగే మాసం కాబట్టి ఈ ఈ మాసాన్ని మాఘ మాసం అంటారు. బ్రహ్మాండ పురాణంలో మాఘ మాసంలో నదీ స్నానం గురించిన విశిష్టత తెలియజేశారు.
మాఘ స్నానంతో లాభాలు
మృకండ మహర్షి అతని ధర్మపత్ని మనస్విని మాఘ స్నానం వల్లనే తమ పుత్రుడైన మార్కండేయునికి ఉన్న అపమృత్యు దోషాన్ని తొలగించుకున్నారు. నదీ, సముద్ర స్నానం చేయడంతోపాటు దానధర్మాలు చేయాలి. ఈ మాసంలో చేసే దానధర్మాలు వల్ల కోటి యజ్ఞ క్రతువులు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. మాఘస్నానం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది.
మాఘ మాసంలో అన్ని తిథులు శ్రేష్టమైనవే. మాఘశుద్ధ విదియ రోజు బెల్లం, ఉప్పు దానం చేయాలి. మాఘ శుద్ధ తదియ రోజున పార్వతీదేవి పూజ, హర తృతీయ వ్రతం ఆచరిస్తారు. మాఘ శుద్ధ చవితి రోజు వదర చతుర్థి పూజ, నాగ ప్రతిష్ఠ చేయడం వలన సంతానం లేనివారికి సంతన భాగభాగ్యం కలుగుతుందని విశ్వాసం.
మాఘ మాసంలో ఏం చేయాలంటే?
ప్రతినిత్యం భగవద్గీత పఠించాలి. విష్ణువు, శివుడు, సూర్యుని ఆరాధన చేయాలి. మాఘ మాసంలో మనసును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. సత్య వచనం. ఎవర్నీ మోసం చేయకూడదు.ఒంటిపూట భోజనం చేయాలి. మితహారం తీసుకోవాలి. నువ్వులు ఆహరంలో తీసుకోవడం మంచిది.
మాఘ మాసంలో ఏం చేయకూడదంటే?
ఈ పవిత్ర మాఘ మాసంలో అబద్ధాలు చెప్పకూడదు. ధర్మాన్నే ఆచరించాలి. తామసిక ఆహారం తినరాదు. ఇతరులు నొచ్చుకునేలా, బాధపడేలా మాట్లాడరాదు. ఒకరిని అవమానించేలా ప్రవర్తించరాదు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.)
