చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే అవాక్కే..
White Hair: ఒకప్పుడు జుట్టు తెల్లబడటం అంటే అది వృద్ధాప్యానికి చిహ్నం. కానీ నేడు పరిస్థితి మారింది. 20 ఏళ్ల యువకుల్లో, అంతకంటే తక్కువ వయసున్న టీనేజర్లలో కూడా తెల్ల జుట్టు మెరుస్తోంది. ఇది చూసి చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ అకాల మార్పుకు కారణం వయసు మళ్లడం కాదు, మనం జీవిస్తున్న ఆధునిక జీవనశైలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన జుట్టుకు రంగునిచ్చేది మెలనిన్ అనే వర్ణద్రవ్యం. జుట్టు కుదుళ్లలో ఉండే మెలనోసైట్లు ఈ మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఎప్పుడైతే ఈ కణాలు మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడం లేదా నిలిపివేయడం చేస్తాయో, అప్పుడు జుట్టు తన సహజ రంగును కోల్పోయి బూడిద లేదా తెల్ల రంగులోకి మారుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
