AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని.. ఏకంగా సచిన్ తోనే ఓపెనర్ గా బరిలోకి.. ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రేమకథ చిత్రాలతో లవర్ బాయ్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.ముఖ్యంగా ఈ నటుడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.ఒకప్పుడు హీరోగా మెప్పించిన అతడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే తాను హీరో కాకపోయుంటే క్రికెటర్ అయ్యేవాడినని అంటున్నారు.

Tollywood : హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని.. ఏకంగా సచిన్ తోనే ఓపెనర్ గా బరిలోకి.. ఎవరంటే?
Sachin
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2026 | 12:53 PM

Share

సినీరంగంలో ఒకప్పుడు లవర్ బాయ్ అంటే పలువురి పేర్లు వినిపించేవి. అందులో తరుణ్ ఒకరు. అప్పట్లో హీరోగా వరుస హిట్స్ అందుకుని.. తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో మెప్పించిన తరుణ్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు.. ప్రేమ, పెళ్లికి దూరంగా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హీరో కాకపోతే తాను క్రికెటర్ అయ్యేవాడినని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తరుణ్ తన కెరీర్, క్రికెట్ పట్ల తనకున్న అపారమైన అభిమానం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రెమ్యూనరేషన్ విషయంలో తను రాజీ పడరని, లవ్‌బాయ్ పాత్రలకే పరిమితమని ఉన్న పుకార్లను తరుణ్ ఖండించారు. నిర్మాతలు, నటుల మధ్య అవగాహన ఉంటుందని, తనకు ఎప్పుడూ రెమ్యూనరేషన్ సమస్య కాలేదని స్పష్టం చేశారు.

రాజమండ్రిలో ఒక అభిమాని “మీ లాంటి అబ్బాయినే చేసుకుంటాను” అని అన్న మాటలను ఇప్పటికీ మర్చిపోలేనని అన్నారు. కృష్ణవంశీ, త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ వంటి దర్శకులు సెంటిమెంట్ సీన్లలో తన నటనను ప్రశంసించారని తెలిపారు. బరువు పెరిగినప్పుడు విమర్శలను ఎదుర్కొన్నట్లు, ఆ తరువాత బరువు తగ్గినట్లు వెల్లడించారు. సి “నువ్వే కావాలి” సినిమా విజయం, అంజలికి నేషనల్ అవార్డు రావడం మధురానుభూతులుగా తెలిపారు. సచిన్ టెండూల్కర్‌తో కలిసి క్రికెట్ మ్యాచ్‌ను ఓపెన్ చేయడం అద్భుతమైన అనుభూతి అని వెల్లడించారు. “అదృష్టం” వంటి కొన్ని సినిమాలు విజయవంతం కాకపోవడం చేదు జ్ఞాపకంగా మిగిలిందని తెలిపారు.

క్రికెట్‌పై తరుణ్ అపారమైన ప్రేమ..

తరుణ్‌కు క్రికెట్ పట్ల అపారమైన ప్రేమ ఉంది. నటుడిగా కాకపోయుంటే ఖచ్చితంగా క్రికెటర్ అయ్యేవాడినని, వృత్తిగా క్రికెట్‌ను ఎంచుకునేవాడినని ఆయన వెల్లడించారు. ఈ రంగంలో పెద్ద స్థాయికి చేరకపోయినా, కనీసం కొంత స్థాయి వరకు ఆడేవాడినని పేర్కొన్నారు. తన జీవితంలో మధురానుభూతులలో ఒకటి 2007 వరల్డ్ కప్ స్క్వాడ్‌లోని 16 మంది ఆటగాళ్లతో, మరో ఐదుగురు హీరోలతో కలిసి ఆడిన ఒక మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో తన అభిమాన ఆటగాడు సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించడం ఒక అద్భుతమైన క్షణమని, “చివరికి ఇండియా తరఫున ఆడినట్లు అనిపించిందని” ఆనందం వ్యక్తం చేశారు.

రెమ్యూనరేషన్ పుకార్లపై స్పష్టత..

పరిశ్రమలో తనపై ఉన్న కొన్ని పుకార్లపై తరుణ్ స్పందించారు. “లవ్‌బాయ్” పాత్రలను మాత్రమే చేస్తారని, రెమ్యూనరేషన్ విషయంలో రాజీపడరని, ఫిక్స్‌డ్ రెమ్యూనరేషన్ కంటే తక్కువకు ఒప్పుకోరని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. “నేను తక్కువకు ఒప్పుకోకపోతే, నన్ను తీసుకోరు, నేను ఆ సినిమా చేయను. ఇది చాలా సింపుల్” అని తరుణ్ అన్నారు. నిర్మాతలతో చర్చలు సాధారణమని, ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే పని చేస్తారని, కాబట్టి తను అర్హులైన ప్రతిఫలాన్ని తీసుకుంటానని వివరించారు. రెమ్యూనరేషన్ ఎప్పుడూ తనకు సమస్య కాలేదని, దీనిపై పెద్దగా చర్చలు కూడా జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

మధురమైన ప్రశంసలు, ఎదురైన విమర్శలు:

తనకు వచ్చిన ఉత్తమ కాంప్లిమెంట్ గురించి చెబుతూ, రాజమండ్రిలో షూటింగ్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి, “మమ్మీ, నువ్వు నాకు పెళ్లి చేస్తే ఇలాంటి అబ్బాయినే తీసుకొచ్చి పెళ్లి చెయ్ అని చెప్తాను” అని అన్న మాటలు గుర్తు చేసుకున్నారు. ఇది తనకు ఆశ్చర్యం కలిగించిందని, “నా లాంటి వాడినే చేసుకుంటాను” అని ఆమె అన్నారని తెలిపారు. తనకు వచ్చిన ప్రశంసలలో సెంటిమెంట్ సీన్లలో తన నటనకు ఎక్కువ మంది మెచ్చుకున్నారని పేర్కొన్నారు. కృష్ణవంశీ, త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ వంటి ప్రముఖ దర్శకులు తన సెంటిమెంట్ నటనను ప్రశంసించారని తెలిపారు. విమర్శల విషయానికొస్తే, ఒకానొక దశలో బరువు పెరిగినప్పుడు “చాలా లావైపోయావు, ఈ సినిమాలో చాలా ఫ్యాటీగా ఉన్నావు, కొంచెం తగ్గాలి” అని విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆ సమయంలో కొంత బాధపడినప్పటికీ, ఆ తరువాత బరువు తగ్గినట్లు చెప్పారు.

కెరీర్‌లో స్వీట్ అండ్ బిటర్ ఎక్స్పీరియన్సెస్:

తన కెరీర్‌లో మధురమైన అనుభవాలను చెబుతూ, “నువ్వే కావాలి” సినిమా విజయానందాన్ని గుర్తు చేసుకున్నారు. అది తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నారు. అంజలికి జాతీయ అవార్డు రావడం కూడా తన మధురానుభూతులలో ఒకటని తెలిపారు. చేదు అనుభవాల విషయానికొస్తే, ఏదైనా సినిమా విజయవంతం కానప్పుడు దాని గురించి మర్చిపోవడానికి ప్రయత్నిస్తానని, దాని గురించి ఆలోచించనని అన్నారు. అయితే, “అదృష్టం” అనే సినిమా తనకు చాలా నచ్చినప్పటికీ, అది విజయవంతం కాకపోవడం చేదు అనుభూతిగా మిగిలిందని వెల్లడించారు. చాలా స్టైలైజ్డ్‌గా చిత్రీకరించిన ఆ సినిమా ఎందుకు విజయవంతం కాలేదని ఆలోచించానని అన్నారు.

Sachin, Tarun

Sachin, Tarun

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..