Boti Curry: బోటి కర్రీ ఇలా వండారంటే.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..

బోటి కర్రీ అంటే చాలా మందికి ఇష్టం. కానీ వండటం పెద్దగా రాదు. బోటి క్లీన్ చేయడానికి సమయం పడుతుందని ఎవరూ తినేందుకు ఇష్ట పడరు. బోటి కర్రీ క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే.. మరో ఎత్తు. ఎంత బాగా వండితే అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ. ఒక్కసారి వండుకుని తిన్నారంటే అస్సలు వదిలి పెట్టరు. వేడి వేడి అన్నంలోకి బోటి కూర వేసుకుని తింటే తిన్న వారు ఆహా అనాల్సిందే. రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బోటి. శరీరంలో రోగ నిరోధక శక్తిని..

Boti Curry: బోటి కర్రీ ఇలా వండారంటే.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..
Boti Curry
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2024 | 9:45 PM

బోటి కర్రీ అంటే చాలా మందికి ఇష్టం. కానీ వండటం పెద్దగా రాదు. బోటి క్లీన్ చేయడానికి సమయం పడుతుందని ఎవరూ తినేందుకు ఇష్ట పడరు. బోటి కర్రీ క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే.. మరో ఎత్తు. ఎంత బాగా వండితే అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ. ఒక్కసారి వండుకుని తిన్నారంటే అస్సలు వదిలి పెట్టరు. వేడి వేడి అన్నంలోకి బోటి కూర వేసుకుని తింటే తిన్న వారు ఆహా అనాల్సిందే. రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బోటి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మరి హెల్దీ అండ్ టేస్టీ ఈ కర్రీని ఎలా వండుతారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బోటి కర్రీ వండటానికి కావాల్సిన పదార్థాలు:

బోటి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, కారం, పసుపు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఆయిల్.

బోటి కర్రీ తయారీ విధానం:

ముందుగా బోటీని ముక్కలుగా చేసి వేడి నీళ్ల వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ముక్కల్లో కొద్దిగా పసుపు, ఉప్పు, నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఇలా చేస్తే బోటీ మొత్తం క్లీన్ అవుతుంది. ఇందులో ఉండే క్రిములు ఏమన్నా ఉంటే బయటకు పోతాయి. ఆ తర్వాత బోటీ ముక్కలను వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ తీసుకుని అందులో.. అల్లం, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇవి మెత్తగా అయ్యాక.. ఉల్లి ముక్కలు కూడా వేసి పేస్ట్ చేయాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు, ఉల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి వేగాక పచ్చి మిర్చి, కరివేపాకు వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేశాక.. టమాటా ముక్కలు వేసి వేయించాలి. ఇవి కూడా వేగాక ఉడికించి పక్కన పెట్టిన బోటి ముక్కలు కూడా వేయాలి.

వీటిని ఓ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేశాక, కారం, పసుపు, ఉప్పు, కొబ్బరి పొడి కొద్దిగా, ధనియాల పొడి, గరం మసాలా వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఐదు నిమిషాలు వేయించాక.. నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి ఓ 10 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించాలి. వేడి తగ్గాక మూత తీసి నీళ్లు ఉంటే దగ్గరబడనిచ్చాక కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బోటీ కర్రీ సిద్దం. ఈ కర్రీని ఎందులోకి తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!