AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakarakaya Chutney: డయాబెటిస్ ఉన్నవారికి వరం.. పోషకాలు నిండిన కాకరకాయ పచ్చడి

డయాబెటిస్ ఉన్నవారు కాకరకాయ పచ్చడి తినడం చాలా మేలు చేస్తుంది. కాకరకాయలో ఉండే చరాంటిన్ వంటి సమ్మేళనాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది, ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది. ఇంకా, కాకరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. చక్కెర రక్తంలో త్వరగా కలవకుండా నిరోధిస్తుంది. ఈ పోషకాలు మధుమేహ నియంత్రణకు, నరాల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి.

Kakarakaya Chutney: డయాబెటిస్ ఉన్నవారికి వరం.. పోషకాలు నిండిన కాకరకాయ పచ్చడి
Nutritious Kakarakaya Chutney
Bhavani
|

Updated on: Sep 28, 2025 | 10:31 AM

Share

ఆరోగ్యం, రుచి రెండూ కలగలిసిన వంటకం తయారు చేయాలంటే కాకరకాయ చట్నీ (లేదా పప్పు) సరైన ఎంపిక. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో కాకరకాయను చేర్చుకోవడానికి ఇది ఒక చక్కని మార్గం. పప్పు, పాలు, తాలింపుతో ఈ పోషకమైన వంటకాన్ని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేయాలో, ఏయే పదార్థాలు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాకరకాయను ఇతర పండ్లతో కలిపి తినడం వల్ల నరాలకు ఉల్లాసం లభిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు కాకరకాయను ఏ రూపంలో తీసుకున్నా అన్ని రకాల పోషకాలు పొందవచ్చు. ఇక్కడ కాకరకాయ, పప్పు, మామిడికాయ కలిపి చేసే చట్నీ (లేదా పప్పు) తయారీ సులభంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు కాకరకాయలు – 250 గ్రాములు (లేత కాకరకాయలు)

చింతపండు – నిమ్మకాయంత

ఎండు మిర్చి – 10 నుండి 12

శనగపప్పు – 1 చెంచా

మినప్పప్పు – 1 చెంచా

జీలకర్ర – 1 చెంచా

ఆవాలు – 1/2 చెంచా

నువ్వులు – 1 చెంచా (వేయించినవి)

బెల్లం – చిన్న ముక్క (లేదా రుచికి తగినంత)

పసుపు – కొద్దిగా

ఉప్పు – సరిపడా

నూనె – వేయించడానికి, తాలింపుకు సరిపడా

తయారీ విధానం కాకరకాయలను శుభ్రంగా కడగాలి. వాటిని చిన్న గుండ్రని ముక్కలుగా కోయాలి. విత్తనాలు గట్టిగా ఉంటే తీసేయండి.

ఒక పాన్ లో కొద్దిగా నూనె వేడి చేయండి. కాకరకాయ ముక్కలు వేసి, అవి ముదురు గోధుమ రంగు వచ్చేవరకు, కరకరలాడే వరకు బాగా వేయించాలి. వేగిన ముక్కలను తీసి పక్కన పెట్టండి.

అదే పాన్ లో కొద్దిగా నూనె ఉంటే సరిపోతుంది. మినప్పప్పు, శనగపప్పు, ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించాలి. చివరిలో నువ్వులు వేసి వెంటనే తీసేయండి.

వేయించిన మసాలా దినుసులు, నానబెట్టిన చింతపండు, పసుపు, ఉప్పు, బెల్లం ముక్కను మిక్సీ జార్ లో వేయాలి. అవసరం అయితే కొద్దిగా నీరు కలిపి, మెత్తని పేస్ట్ అయ్యేలా రుబ్బాలి.

రుబ్బిన పచ్చడి మిశ్రమంలో ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలు వేయాలి. మిక్సీని ఆన్ చేసి, ఒక్కసారి మాత్రమే ఆపివేయాలి. ముక్కలు పూర్తిగా పేస్ట్ కాకూడదు, ముక్కలుగా ఉండేలా చూడాలి.

చిన్న పాన్ లో నెయ్యి లేదా నూనె వేడి చేయండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి, వేగిన తర్వాత పచ్చడిలో వేస్తే, రుచికరమైన కాకరకాయ పచ్చడి సిద్ధం.

చిట్కా: కాకరకాయ చేదు తగ్గించడానికి, కోసిన తర్వాత కొద్దిసేపు ఉప్పు వేసి ఉంచి, తర్వాత కడగవచ్చు. అయితే, చేదును ఇష్టపడే వారు అలా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ కాకరకాయ పచ్చడిని అన్నం లేదా చపాతీతో తింటే టేస్ట్ అదుర్స్.