Crab Pickle Recipe: నాన్ వెజ్ ప్రియుల కోసం సండే స్పెషల్.. గోదావరి స్టైల్ లో పీతల ఆవకాయ పచ్చడి.. రెసిపీ మీకోసం
పీతలతో పులుసు, ఫ్రై, బిర్యానీ వంటి ఆహారపదర్దాలను మాత్రమే కాదు.. పీతల ఆవకాయ పచ్చడిని కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా గోదావరి జిలాల్లో వెరీ వెరీ ఫేమస్ ఈ పీతల ఆవకాయ.

మాంసాహార ప్రియుల్లో చేపలు, మాసం మాత్రమే కాదు సీఫుడ్ అంటే చాలా ఇష్టపడే వారున్నారు. రొయ్యలు, చేపలు, పీతలు ఇలా రకరకాల సీ ఫుడ్ ని ఇష్టంగా తింటారు. సీఫుడ్స్ లో పీతలను ఇష్టపడేవారు సీజన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ పీతల రుచి ఎంత బాగుంటుందో వాటిని బాగు చేసి వండటం కొంచెం కష్టం.. అందుకే పీతల వంటకాలు అంత సులభంగా కాదు. అయితే పీతలతో పులుసు, ఫ్రై, బిర్యానీ వంటి ఆహారపదర్దాలను మాత్రమే కాదు.. పీతల ఆవకాయ పచ్చడిని కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా గోదావరి జిలాల్లో వెరీ వెరీ ఫేమస్ ఈ పీతల ఆవకాయ. సీజల్ లో మాత్రమే దొరికే పీతలను అన్ సీజన్ లో కూడా తినాలనుకుంటే.. పీతల ఆవకాయ పచ్చడిని ట్రై చేయండి.. ఈరోజు పీతల ఆవకాయ పచ్చడి తయారీ గురించి తెలుసుకుందా..
తయారీకి కావాలిన పదార్ధాలు:
పీతలు -1/2 kg చిన్నవి ఆవాలు జీలకర్ర ఇంగువ నిమ్మరసం జీలకర్ర పొడి, ఉప్పు నువ్వుల నూనె కరివేపాకు వెల్లుల్లి సోంపు, కారం పసుపు ధనియాల పొడి




తయరీ విధానం: ముందుగా పీతలను శుభ్రం చేసుకుని వాటిలో ఉప్పు, కారం, పసుపు, నూనె వేసుకుని ఉడకబెట్టుకోవాలి. పీతలు ఆరెంజ్ కలర్ వచ్చే వరకూ ఉడకబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టుకోవాలి.. నాలుగు స్పూన్ల నువ్వుల నూనె వేసుకుని అందులో ఉడకబెట్టుకుని పక్కన బెట్టుకున్న పీతలను స్విమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి.
మసాలా కోసం..మరో బౌల్ తీసుకుని అందులో అర టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఆవపిండి, రుచికి సరిపడా కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోవాలి. అనంతరం ఇందులో రెండు స్పూన్ల ఉప్పు వేసుకుని మిక్స్ చేయాలి. తర్వాత వేయించిన పీతల ముక్కల్లో ఈ మసాలా మిశ్రమం వేసుకుని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో బాణలి తీసుకుని స్టౌ మీద పెట్టుకుని ఒక కప్పు నూనె వేసుకుని వేడి చేసుకుని ఒకటిన్నర టీ స్పూన్ ఆవాలు, ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకుని వేయించాలి. తర్వాత పోపు నూనెను పీతల మసాలా మిశ్రమంలో వేసుకోవాలి. నూనెలో పీతలను కలుపుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల నిమ్మరసం లేదా వెనిగర్ వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పీతల ఆవకాయ పచ్చడి రెడీ.. ఇది రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది. అన్నంలోకి చాలా రుచికరంగా ఉంటుంది
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..