Carrot Laddu Recipe: పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే.. టేస్టీ టేస్టీ క్యారెట్ కొబ్బరి లడ్డు రెసిపీ మీ కోసం..
అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఈ క్యారెట్ ను రెగ్యులర్ గా ఏదొక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈరోజు సులువుగా టేస్టీగా క్యారెట్ కొబ్బరి లడ్డుని తయారు చేయడం తెలుసుకుందాం..
Carrot Laddu Recipe: దుంప కూరల్లో ఒకటి క్యారెట్. ఆరోగ్యానికి ముఖ్యంగా కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఈ క్యారెట్ ను రెగ్యులర్ గా ఏదొక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది .ఈ క్యారెట్ తో కూరలు, సాంబార్ వంటివి చేసుకుంటారు. అంతేకాదు హల్వా వంటి స్వీట్ ని కూడా ఎక్కువగా చేసుకుని తింటారు. అయితే ఈరోజు సులువుగా టేస్టీగా క్యారెట్ కొబ్బరి లడ్డు చేయడం తెలుసుకుందాం..
తయారీకి కావాల్సిన పదార్ధాలు:
క్యారెట్ -1/2 కేజీ పచ్చి కొబ్బరి తురుము పంచదార యాలకుల పొడి జీడీ పప్పు ఎండు ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ పంచదార నెయ్యి ఆరెంజ్ ఫుడ్ కలర్
తయారీ విధానం: ముందుగా క్యారెట్ ను శుభ్రం చేసుకుని.. దానిని తురుముకోవాలి. అనంతరం.. ఒక బాణలి తీసుకుని స్టౌ మీద పెట్టి వెలిగించాలి. బాణలి వేడి ఎక్కిన అనంతరం.. కొంచెం నెయ్యి వేసి.. జీడిపప్పు, ఎండుద్రాక్ష, డ్రైఫ్రూట్స్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుని తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసి.. ముందుగా కొబ్బరి తురుము వేసుకుని వేయించుకోవాలి. తర్వాత దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని మళ్ళీ కొంచెం నెయ్యి వేసి.. క్యారెట్ తురుము వేసుకుని పచ్చి వాసన పోయి.. కమ్మటి స్మెల్ వచ్చేవరకూ స్టవ్ ఫ్లేమ్ స్విమ్ లో పెట్టి వేయించాలి.. అనంతరం పంచదార వేసుకుని.. కరగనివ్వాలి.. అనంతరం ఫుడ్ కలర్ వేసుకుని.. వేయించుకున్న కొబ్బరి తురుము వేసుకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో ఉడికించాలి. దగ్గరకు వచ్చిన అనంతరం యాలకుల పొడి.. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్ మిస్, డ్రై ఫ్రూట్స్ ను వేసుకుని.. రెండు నిముషాలు ఉంచి.. అనంతరం స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లార నిచ్చి తర్వాత చేతికి నెయ్యి రాసుకుని లడ్డుల్లా చుట్టుకోవాలి. అంతే రుచికరమైన క్యారెట్ లడ్డులు రెడీ.. వీటిని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..