Healthy Eating: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? అయితే ప్రమాదంలో పడినట్లే.. షాకింగ్ విషయాలు..
అయితే కొంత మంది కొన్ని అపోహలతో అల్పాహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తద్వారా తమ ఆరోగ్యాన్ని వారే చెడగొట్టుకుంటారు. ఈ నేపథ్యంలో సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఉన్న అపోహలు.. వాస్తవాలపై నిపుణులు చెబుతున్న విషయాలు..
పని ఒత్తిడిలో పడి ఉదయం బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారా? ఆ.. ఏముందిలే , మధ్యాహ్నం తినొచ్చులే అని లైట్ తీసుకుంటున్నారా? ఒక్క పూట తినకపోతే నష్టం ఏమి లేదులే అని పక్కన పెడుతున్నారా? అయితే మీరు అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లే! ఎందుకంటే శరీరానికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా ముఖ్యమైన వనరు. దీని ద్వారా శరీరంలో అన్ని క్రియలు యాక్టివేట్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంత మంది కొన్ని అపోహలతో అల్పాహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తద్వారా తమ ఆరోగ్యాన్ని వారే చెడగొట్టుకుంటారు. ఈ నేపథ్యంలో సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఉన్న అపోహలు.. వాస్తవాలపై నిపుణులు చెబుతున్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలంటే బ్రేక్ ఫాస్ట్ మానేయ్యాలా?
చాలా మందిలో ఉన్న ప్రధాన అపోహ ఇది. శరీర బరువు తగ్గాలంటే ఉదయం అల్పాహారం తీసుకోవడం మానేయ్యండి అని చాలా మంది సలహాలు ఇస్తుంటారు. అయితే దాని వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకూ కడుపు ఫాస్టింగ్ లో ఉంటుంది. ఉదయం ఆ ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడమే బ్రేక్ ఫాస్ట్. అయితే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఎక్కువ సమయం కడుపు ఖాళీగా ఉండిపోయి జీవక్రియ మీద ప్రభావం చూపుతుంది. బ్రేక్ ఫాస్ట్ సమయానికి చేస్తే జీవక్రియ సాఫీగా జరుగుతుంది. శరీరానికి శక్తినిస్తుంది. రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ మానేయ్యాల్సిన అవసరం లేదు.
కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు ఇచ్చే ఫుడ్స్ కలిపి తింటే..
శరీరానికి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ సమపాళ్లలో అందాలి. బ్రేక్ ఫాస్ట్ లో ఇవి రెండూ దొరికే ఆహారం తీసుకోకూడదని చాలా మంది అపోహ పడుతుంటారు. అయితే వాస్తవం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయ ఫైబర్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అందించే ఆహారం తీసుకోవడం మంచిది. గుడ్డు, కూరగాయలు, పాలు, పండ్లు, గింజలు, ఓట్స్ వంటివి తీసుకోవచ్చు. ఇవి జీవ క్రియను పెంచడంతో పాటు అనవసర కొవ్వును కరిగించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
బ్రేక్ ఫాస్ట్ లేట్ గా చేస్తే..
చాలా మంది నిద్ర పోయి లేచిన చాలా సమయం తర్వాత అల్పాహారం తింటారు. కానీ నిద్రలేచిన గంట లోపు బ్రేక్ ఫాస్ట్ చేసేయాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే షుగర్ లెవెల్స్, బాడీ ఫ్యాట్ వంటి వాటిపై ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు.
ఎక్కువగా మోతాదులో బ్రేక్ ఫాస్ట్ చేస్తే..
ఉదయం ఎక్కువ ఆహారం తీసుకోవాలి.. రాత్రి తక్కువ ఆహారం తినాలి అని అందరూ అంటుంటారు. అయితే నిజం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయం సమయంలో ఎక్కువ తినడం వల్ల అదనంగా వచ్చే ప్రయోజనం ఏమి ఉండదని, శరీరానికి అవసరమైనంత మోతాదులో అల్పాహారం తీసుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారు.
నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగవచ్చా..
చాలా మందికి ఇది అలవాటు. నిద్రలేవగానే , బెడ్ మీదనే టీ లేదా కాఫీ తాగడం చేస్తుంటారు. అయితే వీటిలో ఉండే యాసిడ్, కెఫిన్ వంటి పదార్థాలు ఖాళీ కడుపులోకి వెళ్తే అవి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. దాని బదులు ప్రోటీన్లతో నిండిన విజిటబుల్ స్పూతీ, పండ్ల రసం వంటివి తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.
బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తే..
ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అనవసరపు తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతాయని హెచ్చరిస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకూ ఉదయం లేవగానే బ్రష్ చేసి సరిపడినంత అల్పాహారం తీసుకోవడం.. అది కూడా కాస్త ప్రోటీన్లతో కూడినది తినడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..