AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అయితే వెంటనే కంట్రోల్ అవుతుందట..

ప్రతి వ్యక్తి శరీరంలో తగిన మోతాదులో  కొలెస్ట్రాల్ స్థాయిలు ఉండటం ఎంతో అవసరం. అదే కొలెస్ట్రాల్ ఎక్కువైతే మాత్రం ప్రాణానికే ప్రమాదం. కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లు మొదట్లో తెలియదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు..

Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అయితే వెంటనే కంట్రోల్ అవుతుందట..
Bad Cholesterol
Amarnadh Daneti
|

Updated on: Dec 18, 2022 | 9:55 AM

Share

ప్రతి వ్యక్తి శరీరంలో తగిన మోతాదులో  కొలెస్ట్రాల్ స్థాయిలు ఉండటం ఎంతో అవసరం. అదే కొలెస్ట్రాల్ ఎక్కువైతే మాత్రం ప్రాణానికే ప్రమాదం. కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లు మొదట్లో తెలియదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు.. మాత్రమే తెలుస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ ఎక్కువుగా ఉండే ఆహారాలను తీసుకోవడం తగ్గించడం మంచిది.  హార్మోన్ల ఉత్పత్తికి, సెల్ గోడలను ఫ్లెక్సిబుల్ గా ఉంచడంలో కొలెస్ట్రాల్ దోహదపడుతుంది. ఇదే సమయంలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, గుండె పోటు వంటి సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలిలో వస్తున్న మార్పులు, కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ లైపోప్రొటీన్ల కలయికతో ఉంటుంది. కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణను నిరోధిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి HDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఎటువంటి చిట్కాలు పాటించాలో చూద్దాం..

వ్యాయామం తప్పనిసరి

వ్యాయామం శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. వ్యాయమాలు చేయడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. తేలికపాటి వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ ప్రమాదం నుంచి కాపాడతాయి.

కరిగే ఫైబర్ తీసుకోవడం

సోయాబీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, పండ్లు, ఇతర తృణధాన్యాలు కరిగే ఫైబర్‌కు మూలాలు. వాటిని తీసుకోవడం వల్ల శరీరం నుండి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడే బ్యాక్టీరియా ప్రోబయోటిక్‌కు సహాయసడుతుంది.

ఇవి కూడా చదవండి

మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్

ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్, ట్రీ నట్స్, అవకాడోస్ వంటి మోనోఅన్‌ శాచురేటెడ్ కొవ్వులను తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది, అదే సమయంలో హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి దోహదపడుతుంది.

ఆరోగ్యకరమైన బరువు

బరువు తగ్గడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బరువు తగ్గడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్ పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం!
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం!