AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ginger Vada: నైవేద్యానికి పర్ఫెక్ట్ రెసిపీ.. ఉల్లిపాయ లేని వేడి వేడి అల్లం గారెలు..

వేడి వేడి గారెలు అంటే ఇష్టపడని తెలుగువారు ఉండరు. అల్పాహారంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దసరా పండుగలలో నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవికి అల్లం గారెలు నైవేద్యంగా పెడతారు. నైవేద్యానికి తయారు చేసేటప్పుడు, ఉల్లిపాయను వేయకుండా ఇదే పద్ధతిలో చేసుకోవాల్సి ఉంటుంది. రుచికరమైన అల్లం గారెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పద్ధతిలో చేస్తే గారెలు మెత్తగా, సువాసనతో నిండి ఉంటాయి.

Ginger Vada: నైవేద్యానికి పర్ఫెక్ట్ రెసిపీ.. ఉల్లిపాయ లేని వేడి వేడి అల్లం గారెలు..
Ginger Vada Recipe
Bhavani
|

Updated on: Sep 23, 2025 | 5:03 PM

Share

అల్లం గారెలు ఆంధ్రాలో ఒక స్పెషల్ అల్పాహారం. ఇవి బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి అద్భుతమైన రుచిని ఇస్తాయి. వాటిని ఇంటి వద్ద సులభంగా తయారు చేయవచ్చు. ఈ రెసిపీని అనుసరించి ఎవరైనా రుచికరమైన అల్లం గారెలు చేయవచ్చు. దసరా నవరాత్రుల్లో నైవేద్యంగా వీటిని ఉంచి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.

కావాల్సిన పదార్థాలు

పొట్టు మినపప్పు: రెండు కప్పులు

అల్లం: 20 గ్రాములు

పచ్చిమిర్చి: 10

ఉల్లిపాయ: ఒకటి

కొత్తిమీర: ఒక చిన్న కట్ట

కరివేపాకు: నాలుగు రెమ్మలు

నూనె: అర కిలో

ఉప్పు: తగినంత

తయారీ విధానం

ముందుగా పొట్టు మినపప్పును ఐదు గంటల పాటు నానబెట్టాలి. పొట్టు మినపప్పును మూడు, నాలుగు సార్లు కడిగి పొట్టును తీసివేయండి. మినపగుళ్ళను బాగా కడిగి, వడగట్టండి.

వడగట్టిన పప్పును గ్రైండర్ లో నీళ్లు పోయకుండా, మధ్య మధ్యలో నీళ్లు చిలకరిస్తూ గట్టిగా గ్రైండ్ చేయండి.

గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, చిన్న ముక్కలుగా తరిగిన అల్లం, ఉల్లిపాయలు, మెత్తగా దంచిన పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి చేతితో బాగా కలపండి.

ఈ పిండిని ఒక అరగంట సేపు ఫ్రిజ్ లో ఉంచండి. అలా చేస్తే గారెలు మెత్తగా వస్తాయి.

ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పోసి బాగా వేడి చేయండి. తర్వాత మంటను మీడియంలో పెట్టండి.

ఒక చిన్న అరిటాకును లేదా ఒక చిన్న మైనపు కవరును తీసుకుని ఎడమ చేతిలో పెట్టుకోండి. కుడి చేతితో పిండి తీసుకుని, నిమ్మకాయంత ఉండలా చేయండి.

తడి చేసుకున్న అరిటాకు లేదా కవర్ మీద పెట్టి, గుండ్రంగా ఒత్తి మధ్యలో చిన్న రంధ్రం చేయండి. దానిని కాగుతున్న నూనెలో జాగ్రత్తగా వేయండి.

ఇలా నాలుగైదు గారెలు చొప్పున వేసుకుని, అట్లకాడతో అటు ఇటు తిప్పుతూ బంగారు రంగులో వేయించండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!