- Telugu News Photo Gallery Green Chillies for Heart Health, Know eating Benefits, Risks and how much to consume it
Heart Health: గుండె సమస్యలకు దివ్య ఔషదం.. వీటిని మితంగా తీసుకుంటే.. మీ జీవితానికి డోకా లేనట్టే!
పచ్చిమిర్చి ఆహార రుచిని పెంచడమే కాకుండా,మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ, బీటా-కెరోటిన్, ఐరన్, పొటాషియం గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఆహారానికి ఘాటైన రుచిని ఇస్తుంది అలాగే శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి పచ్చిమిర్చీ ఎలా దోహదపడుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Sep 23, 2025 | 6:38 PM

పచ్చి మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇది ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

పచ్చి మిరపకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి. అలాగే పచ్చిమిర్చి క్యాన్సర్ నుండి కూడా రక్షిస్తుంది. వాటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. క్యాప్సైసిన్ కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

పచ్చి మిరపకాయలలోని పొటాషియం రక్తపోటును నియంత్రిండంలో సహాయపడుతుంది, అయితే వాటిలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి.

పచ్చి మిరపకాయల్లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంచడంలో సహాయపడుతుంది, ఇది మీ శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

పచ్చిమిర్చి గుండెకు మంచిదే, కానీ వాటిని ఎక్కువగా తినడం కొన్ని సార్లు హానికరం కావచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల గుండెల్లో మంట, ఆమ్లత్వం, అల్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.కాబట్టి, పచ్చిమిర్చిని మితంగా తినడం ఎల్లప్పుడూ మంచిది.( పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యులను సంప్రదించండి)




