AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fenugreek Uses: సర్వరోగ నివారిణి మెంతులు.. సరిగ్గా వాడితే పర్ ఫెక్ట్ లైఫ్ మీదే!

మెంతుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మెంతుల గురించి అందరికీ తెలుసు. చాలా రకాలుగా మనం మెంతుల్ని ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో, పచ్చళ్లలోకి మెంతును వాడుతూ ఉంటారు. మెంతులతో వంటలే కాకుండా ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా మెంతులను పలు అనారోగ్య సమస్యల్ని తగ్గించేందుకు ఔషధంలా ఉపయోగించే వారు. మెంతుల్లో పలు రకాల ఔషధ..

Fenugreek Uses: సర్వరోగ నివారిణి మెంతులు.. సరిగ్గా వాడితే పర్ ఫెక్ట్ లైఫ్ మీదే!
Fenugreek Uses
Chinni Enni
|

Updated on: May 10, 2024 | 2:26 PM

Share

మెంతుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మెంతుల గురించి అందరికీ తెలుసు. చాలా రకాలుగా మనం మెంతుల్ని ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో, పచ్చళ్లలోకి మెంతును వాడుతూ ఉంటారు. మెంతులతో వంటలే కాకుండా ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా మెంతులను పలు అనారోగ్య సమస్యల్ని తగ్గించేందుకు ఔషధంలా ఉపయోగించే వారు. మెంతుల్లో పలు రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, కాపర్, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్‌, విటమిన్లు ఎ, బి6, సి, కె వంటివి లభిస్తాయి. మెంతుల్ని సరిగ్గా వాడారంటే.. అనేక సమస్యలు ఈజీగా తగ్గించుకోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో, అధిక బరువు, డయాబెటీస్‌ను కంట్రోల్ చేయడంలో.. మెంతులు చక్కగా పని చేస్తాయి. మెంతులతో ఎలా తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతుల్ని నానబెట్టి తీసుకుంటే..

మెంతులని రాత్రంతా నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే.. బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే నానబెట్టిన మెంతుల్ని కూడా పూర్తిగా నమిలి తినాలి. అలా తింటే కడుపు క్లీన్ అవ్వడమే కాకుండా.. డయాబెటీస్ అదుపులో ఉంటుంది. అంతే కాకుండా వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. మీకు వారం రోజుల్లోనే తేడా కనిపిస్తుంది.

మొలకెత్తిన మెంతులు తింటే..

మొలెత్తిన మెంతుల్లో గెలాక్టోమన్నన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను గ్రహించి.. పేగుల్లో ఎండే చెడు బ్యాక్టీరియాను బయటకు పంపిస్తుంది. పొట్ట క్లీన్ అయి.. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బయటకు పోతుంది.

ఇవి కూడా చదవండి

మెంతి టీ తాగితే..

మీరు ప్రతి రోజూ మెంతి టీ తాగితే.. క్యాన్సర్ కణాలను నశింపచేస్తాయి. మీ కొలెస్ట్రాల్‌ లెవల్స్ అనేవి నియంత్రణలో ఉంటాయి. ఈ మెంతి టీలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి కాబట్టి.. చర్మానికి, జుట్టుకు, పొట్ట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

మెంతి పొడితో..

మెంతులను దోరగా వేయించి.. పొడి చేసి పెట్టుకోండి. ఈ మెంతి పొడిని ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కలుపుకుని తరచూ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. వెయిట్ లాస్ కూడా అవుతారు. కడుపుకు చాలా మంచిది. పాలల్లో కూడా కలుపుకుని తాగవచ్చు. పేగులు కూడా క్లీన్ అవుతాయి. కాలేయ వ్యాధి, మూత్ర పిండాల వ్యాధులు రాకుండా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా