- Telugu News Photo Gallery If these foods are given to children, the brain will work faster, check here is details
Brain Foods for Kids: ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ భలే స్పీడుగా పని చేస్తుంది..
పిల్లలు చురుగ్గా, ఆరోగ్యంగా, అన్నింట్లో ముందుండాలని ప్రతీ తల్లిదండ్రులు ఖచ్చితంగా కోరుకుంటారు. పేరెంట్స్ ఇలా అనుకోవడంలో తప్పు లేదు కానీ.. వారు బ్రెయిన్ యాక్టివ్‌గా చేసేందుకు అవసరం అయిన ఆహారాలు కూడా అందించాలి. వారి ఫోకస్ పెరిగేందుకు కొన్ని ఫుడ్స్ అవసరం. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో కోడి గుడ్డు కూడా ఒకటి. గుడ్డును ప్రతి రోజూ పిల్లలకు ఇస్తే.. వారి బ్రెయిన్ ఎదుగుదల, ఫోకస్ అనేవి..
Updated on: May 10, 2024 | 5:52 PM

పిల్లలు చురుగ్గా, ఆరోగ్యంగా, అన్నింట్లో ముందుండాలని ప్రతీ తల్లిదండ్రులు ఖచ్చితంగా కోరుకుంటారు. పేరెంట్స్ ఇలా అనుకోవడంలో తప్పు లేదు కానీ.. వారు బ్రెయిన్ యాక్టివ్‌గా చేసేందుకు అవసరం అయిన ఆహారాలు కూడా అందించాలి. వారి ఫోకస్ పెరిగేందుకు కొన్ని ఫుడ్స్ అవసరం.

పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో కోడి గుడ్డు కూడా ఒకటి. గుడ్డును ప్రతి రోజూ పిల్లలకు ఇస్తే.. వారి బ్రెయిన్ ఎదుగుదల, ఫోకస్ అనేవి పెరుగుతాయి. ఎగ్‌ని మీరు అనేక రకాలుగా తయారు చేసి పెట్టొచ్చు. అదే విధంగా యోగర్ట్‌లో కూడా బ్రెయిన్‌ని యాక్టివ్ చేసే గుణాలు ఉంటాయి. ఇది కూడా పెట్టొచ్చు.

సీ ఫుడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెయిన్‌ని చురుగ్గా చేయడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా, సార్డైన్ చేపల్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఇవి పిల్లలకు పెట్టడం వల్ల వారిలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది.

అదే విధంగా నట్స్‌లో కూడా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయ పడతాయి. అంతే కాకుండా పిల్లల్లో ఏకాగ్రతను నింపుతాయి. నెయ్యి కూడా పిల్లలకు పెడితే చాలా మంచిది. ఆకు కూరల్లో కూడా అద్భుతమైన పోషకాలు లభిస్తాయి.

ఆకు కూరల్లో ఉండే పోషకాలు.. పిల్లల్లో మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బెర్రీస్ జాతికి చెందిన ఫ్రూట్స్ పిల్లలకు బాగా పెట్టడం వల్ల వారిలో బ్రెయిన్ ఇంప్రూవ్ మెంట్ చక్కగా జరుగుతుంది. సీజనల్ పండ్లు కూడా వారికి అందిస్తూ ఉండాలి.





























