Relationship Tips: రొమాన్స్ పై ఆసక్తి తగ్గుతుందా ?? దంపతులు.. ఈ టిప్స్ మీ కోసమే
లైంగికంగా భాగస్వామితో బాగా కలవాలనిపించినప్పుడు వారితో దాని గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. మీ ఇద్దరిలో ఎవరికి ఆసక్తి లేకపోయినా ఏమైంది అని ఆరా తీయాలి. రొమాంటిక్ లైఫ్ అనేది చాలా సున్నితమైన అంశం. అందువల్ల భాగస్వామి చెప్పే మాటలను, వారి ఫీలింగ్స్‌ను అర్ధం చేసుకోవాలి. అప్పుడే ఇద్దరు ఆనందంగా ఉండగలరు. మీ భాగస్వామిలో లైంగిక కోరికలు పెంచే మాటలను మాట్లాడాలి. వారిలో కోరికను పేరేపించేలా నడుచుకోవాలి. ఇలాంటి పనులే వారిలో ఫీలింగ్స్ కలిగిస్తాయి. సున్నితంగా మీ ఫీలింగ్స్ మీ లైఫ్ పార్ట్నర్ కు తెలియచెప్పడం ద్వారా కూడా మీ రొమాంటిస్ లైఫ్ బాగుంటుంది.
Phani CH |
Updated on: May 10, 2024 | 5:45 PM

లైంగికంగా భాగస్వామితో బాగా కలవాలనిపించినప్పుడు వారితో దాని గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. మీ ఇద్దరిలో ఎవరికి ఆసక్తి లేకపోయినా ఏమైంది అని ఆరా తీయాలి. రొమాంటిక్ లైఫ్ అనేది చాలా సున్నితమైన అంశం. అందువల్ల భాగస్వామి చెప్పే మాటలను, వారి ఫీలింగ్స్‌ను అర్ధం చేసుకోవాలి. అప్పుడే ఇద్దరు ఆనందంగా ఉండగలరు.

మీ భాగస్వామిలో లైంగిక కోరికలు పెంచే మాటలను మాట్లాడాలి. వారిలో కోరికను పేరేపించేలా నడుచుకోవాలి. ఇలాంటి పనులే వారిలో ఫీలింగ్స్ కలిగిస్తాయి. సున్నితంగా మీ ఫీలింగ్స్ మీ లైఫ్ పార్ట్నర్ కు తెలియచెప్పడం ద్వారా కూడా మీ రొమాంటిస్ లైఫ్ బాగుంటుంది.

మీ రొమాంటిక్ లైఫ్ బాగుండటం కోసం కొత్త ప్రయోగాలు చేయడం అత్యవసరం. ప్రతి రోజు ఏదో కొత్తగా ట్రై చేస్తేనే మీ సంసార జీవితం బాగుంటుంది. దంపతులు ఇద్దరూ కలిసి స్నానం చేస్తే ఒకరిపై ఒకరికి లైంగిక కోరికలు పెరుగుతాయి. దీనివల్ల రెట్టింపు మూడ్‌తో రొమాంటిక్ లైఫ్ బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.

మీ పార్ట్‌నర్‌లో వాంఛ కోరికలను పెంచే మార్గాల్లో ఒకటి ముద్దు. ఇద్దరూ ఎక్కువసేపు ముద్దు పెట్టుకోవడం వల్ల లైంగిక కోరికలు బాగా పెరుగుతాయి. దీనికి కారణం ఆ సమయంలో ఒకరి లాలాజలం మరొకరి నోట్లోకి ప్రవేశించడమే. లాలాజలంలో టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఇది కామవాంఛను బాగా పెంచుతుంది.

మగ, ఆడవారిలో కామవాంఛలను పెంచేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అలా చేయడం ద్వారా మీ పార్ట్‌నర్‌కు ఫీలింగ్స్ పెంచవచ్చు. మీ పార్ట్‌నర్‌లో కోరికలు పెంచేందుకు మీ టచ్ చాలు. ఏకాంతంగా ఉన్న సమయాల్లో అలాంటి టచ్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామిలో లైంగిక కోరికలు పెరిగి మూడ్‌లోకి వెళ్లిపోతారు.

కొన్ని సందర్భాల్లో లైంగిక కోరిక తగ్గడానికి దీర్ఘకాలిక సమస్యలకు వాడుతున్న మందులు కారణం కావచ్చు. యాంటీడిప్రెసెంట్లు, రక్తపోటు మందులు, క్యాన్సర్ చికిత్సలకు తీసుకుంటున్న మందుల ద్వారా లైంగిక కోరికలు తగ్గవచ్చు. అలాంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించండి.





























