- Telugu News Photo Gallery Cinema photos Faria Abdullah says she doesn't like marriage and wants children of her own
Faria Abdullah: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఫరియా అబ్దులా.. అసలు విషయం ఏంటంటే..
మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ కొట్టింది ఫరియా అబ్దుల్లా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన జాతి రత్నాలు చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేశాడు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం అందుకుంది. జాతి రత్నాలు సినిమా ద్వారా పాపులర్ అయినా లాయర్ పాత్రలో ఫరియా నటన నవ్వులు పూయిస్తుంది.. తన క్యూట్ అందాలతో మాటల తో ప్రేక్షకుల మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.
Updated on: May 10, 2024 | 5:15 PM

మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ కొట్టింది ఫరియా అబ్దుల్లా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన జాతి రత్నాలు చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేశాడు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం అందుకుంది.

జాతి రత్నాలు సినిమా ద్వారా పాపులర్ అయినా లాయర్ పాత్రలో ఫరియా నటన నవ్వులు పూయిస్తుంది.. తన క్యూట్ అందాలతో మాటల తో ప్రేక్షకుల మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. జాతి రత్నాలు అనంతరం ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు.

తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో గెస్ట్ రోల్చేయగా తరువాత బంగార్రాజు మూవీలో ఫరియా ఐటెం సాంగ్ చేసింది. తరువాత రవితేజ నటించిన రావణాసుర చిత్రంలో ఫరియా అబ్దుల్లా కీలక రోల్ చేసింది. రావణాసుర సైతం ఆశించిన స్థాయిలో ఆడలేదు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం గురించి ఫరియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. నాకు వివాహ వ్యవస్థ మీద పెద్దగా నమ్మకం లేదు. పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలని అనుకోవడం లేదు. పెళ్లి అయితే అవుతుంది లేకుంటే లేదు. పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన చేయలేదు అని తెలిపింది ఫరియా.

కానీ నాకు పిల్లలు అంటే ఇష్టం. పిల్లల్ని ఎలాగైనా కనొచ్చు. వాళ్ళను మంచిగా పెంచేందుకు తండ్రి బాధ్యతగా ఉండాలి. నాకు మ్యారేజ్ కాన్సెప్ట్ అంటేనే భయం వేస్తుంది... అని ఫరియా కుండబద్దలు కొట్టారు. కాబట్టి ఫరియా పెళ్లి చేసుకోకుండానే భవిష్యత్ లో తల్లి అవనుందని కొందరుకామెంట్స్ చేస్తున్నారు.




