Health Tips: ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులు తింటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

Curry Leaves: దక్షిణ భారత వంటకాల్లో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తారు. కరివేపాకు ఆహారం రుచి, వాసనను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

Health Tips: ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులు తింటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Curry Leaves Benefits
Follow us

|

Updated on: May 25, 2022 | 12:37 PM

కరివేపాకు వంటల రుచిని పెంచడమే కాకుండా సువాసనను కూడా అందిస్తుంది. ఈ ఆకులను దక్షిణ భారత వంటకాల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. చాలామంది ఇంట్లో కూడా కరివేపాకు మొక్కలను పెంచుకుంటుంటారు. ఇటువంటి పరిస్థితిలో అవసరమైనప్పుడు తాజా కరివేపాకులను వంటలలో ఉపయోగించవచ్చు. అయితే, కరివేపాకు(Curry Leaves) ఆహారం రుచి, వాసనను పెంచడమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆకుల్లో రాగి, విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీరు రోజూ ఉదయాన్నే 2 నుంచి 3 కరివేపాకులను నమిలి తింటే, అవి మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి.

డయాబెటిక్ రోగులకు..

ఈ ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు జరుగుతుంది. నివేదికల ప్రకారం, ఈ ఆకులు హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా..

ప్రతిరోజూ ఉదయాన్నే కరివేపాకు ఆకులను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఉబ్బరం, మలబద్ధకం, అసిడిటీ వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి పనిచేస్తాయి. అందువల్ల, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి వీటిని తీసుకోవచ్చు.

బరువు తగ్గటానికి..

కరివేపాకు కూడా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి జీవక్రియ రేటును వేగవంతం చేస్తాయి. ఇవి శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఈ విధంగా వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

రోగనిరోధక శక్తిని పెంచడానికి..

కరివేపాకులో ఔషధ గుణాలున్నాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులను ఖాళీ కడుపుతో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కాలేయం ఆరోగ్యం కోసం..

వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆకులు కాలేయం పనితీరును పెంచడానికి పని చేస్తాయి. అందువల్ల, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మీరు ఈ ఆకులను ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తినవచ్చు.

కళ్లకు మంచిది..

కరివేపాకులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు ఖాళీ కడుపుతో కరివేపాకు తినవచ్చు. ఇది కంటి సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో