AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ధోనీ-కోహ్లిలను వెనక్కునెట్టిన సంజూ శాంసన్.. ఆ చెత్త రికార్డ్‌లో నంబర్ వన్.. అదేంటంటే?

Rajasthan Royals Captain Sanju Samson: రాజస్థాన్ కెప్టెన్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని విడిచిపెట్టాడు.

IPL 2022: ధోనీ-కోహ్లిలను వెనక్కునెట్టిన సంజూ శాంసన్.. ఆ చెత్త రికార్డ్‌లో నంబర్ వన్.. అదేంటంటే?
Gt Vs Rr Qualifier 1 Sanju Samson
Venkata Chari
|

Updated on: May 25, 2022 | 7:57 AM

Share

ఐపీఎల్‌ 2022 సీజన్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. అయితే, ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు, హ్యాట్రిక్‌లు లేదా సెంచరీలతో ఆటగాళ్లు అద్భుతాలు చేశారు. కాగా, చెత్త రికార్డులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో చేరకూడదనుకుని ఆటగాళ్లు కూడా కోరుకుంటారు. తాజాగా మరో చెత్త రికార్డులో రాజస్థాన్ రాయల్స్ సారథి చేరాడు. నిలకడగా రాణిస్తున్న ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్, మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni), విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు చేరిన ఓ అనుకోని రికార్డును సమం చేశాడు.

సంజూ శాంసన్ ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను అతని కెప్టెన్సీలో ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. అయితే చాలా సందర్భాలలో అదృష్టం అతనికి పెద్దగా మద్దతు ఇవ్వలేదు. ముఖ్యంగా బాల్ బ్యాట్ ఢీకొనడానికి ముందు అదృష్టం అస్సలు కలిసిరాలేదు. ఈ సీజన్‌లో టాస్ గురించి మాట్లాడితే, ప్రతి జట్టు కెప్టెన్ పరిస్థితులను పసిగట్టి టాస్ గెలిచి తన ఎంపికను నిర్ణయించుకున్నాడు. కానీ, ఈ విషయంలో ప్రతీసారి శాంసన్‌కు బ్యాడ్‌లక్ ఎదురైంది. అయినా, సరే తన బలమైన జట్టుతో ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించాడు.

ఒక సీజన్‌లో ఎన్ని టాస్‌లు ఓడిపోయాడంటే..

ఇవి కూడా చదవండి

ఈ కాయిన్ గేమ్ ప్లేఆఫ్‌లలో కూడా శాంసన్‌‌ను వదిలిపెట్టలేదుదు. మంగళవారం, మే 24, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫయర్‌లో టాస్‌లో శాంసన్ టీం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే, టాస్‌లోనూ శాంసన్‌కు చుక్కెదురైంది. దీంతో ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో శాంసన్‌ 15 మ్యాచ్‌ల్లో 13 సార్లు టాస్‌ ఓడిపోయాడు.

రాజస్థాన్ కెప్టెన్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని విడిచిపెట్టాడు. 2012లో ధోనీ 12 సార్లు టాస్ ఓడిపోగా, 2013లో కోహ్లీ 11 సార్లు టాస్ ఓడిపోయాడు.

బ్యాట్‌తో వర్షం..

క్వాలిఫైయర్ల ఫలితం ఏమైనప్పటికీ, శాంసన్ ఈ సీజన్‌లో బ్యాట్‌తో అద్భుతాలు చేశాడు. ఆరంభంలోనే తొలి వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన రాజస్థాన్ కెప్టెన్.. రాగానే పరుగుల వరద పారించాడు. జట్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. అతను అర్ధ సెంచరీని కోల్పోయినప్పటికీ కేవలం 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..