Pregnancy Care: గర్భంతో ఉన్న సమయంలో వీటిని అసలు తినకూడదు..

తల్లిగా మారడం అనేది ఏ అమ్మాయికైనా  ఓ అందమైన అనుభూతి. అందుకే పెళ్లైన అమ్మాయిలందరూ ఎప్పుడెప్పుడు అమ్మగా ప్రమోషన్ పొందుదామా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Pregnancy Care: గర్భంతో ఉన్న సమయంలో వీటిని అసలు తినకూడదు..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 17, 2022 | 6:46 AM

తల్లిగా మారడం అనేది ఏ అమ్మాయికైనా  ఓ అందమైన అనుభూతి. అందుకే పెళ్లైన అమ్మాయిలందరూ ఎప్పుడెప్పుడు అమ్మగా ప్రమోషన్ పొందుదామా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.  ఈ క్రమంలో గర్భం దాల్చిన వారి ఆనందానికి ఆకాశమే హద్దు. కానీ  ఆ తర్వాత ఉండే  నవ మాసాల ప్రయాణం అమ్మయ్యే దశలో ఎంతో కీలకం. గర్భం దాల్చిన మొదలు ప్రసవం అయ్యేంత వరకు గర్భిణీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  లేవడం, కూర్చోవడం,  తినడం, తాగడం ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.  చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాగా గర్భధారణ సమయంలో కడుపులోని బిడ్డ బాగా అభివృద్ధి చెందడానికి ఐరన్,  క్యాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు మొదలైన పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తారు. అదే సమయంలో  కొన్ని పదార్థాలు తినకూడదంటారు. ఎందుకంటే ఒక్కోసారి ఇవి గర్భస్రావానికి కారణం కావచ్చు. మరి గర్భధారణ సమయంలో అసలు తినని కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం రండి.

బొప్పాయి..

గర్భధారణ సమయంలో బొప్పాయి తినకపోవడమే మంచిది. ముఖ్యంగా పచ్చి బొప్పాయిని అస్సలు తినకూడదు. నిజానికి, పచ్చి బొప్పాయిలో పపైన్ అనే  రసాయనం ఉంటుంది. దీని కారణంగా కడుపులో పెరుగుతున్న పిండంలో కొన్ని లోపాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడు అబార్షన్ కూడా అయ్యే అవకాశాలున్నాయి.

చేపలు

చేపలు ఆరోగ్యానికి చాలా మంచివంటారు. దీన్ని తినడం వల్ల విటమిన్ డి, ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తదితర ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందుతాయి.  అయితే అపరిశుభ్రమైన నీటిలో నివసించడం, ఇతర జీవులను తినడం ద్వారా కొన్నిసార్లు పాదరసం చేపల శరీరంలోకి వెళుతుంది.   ఇది చేపల కండరాలలో గట్టిగా స్థిరపడుతుంది చేపలను ఉడికించినప్పుడు కూడా ఇది పోదు.  ఇలాంటి చేపలను తింటే గర్భస్రావం కలిగే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల గర్భధారణ సమయంలో చేపలు తినకపోవడమే మంచిది.

 పచ్చి గుడ్డు

గర్భధారణ సమయంలో పచ్చి గుడ్లను అస్సలు తీసుకోకండి. ఇందులోని సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.  అదేవిధంగా  వికారం, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

తులసి ఆకులు

జలుబు, దగ్గు తదితర సమస్యలు ఉన్నప్పుడు, మహిళలు తరచుగా తులసి టీని లేదా తులసి ఆకులతో తయారుచేసిన వివిధ రకాల పానీయాలను ఎక్కువగా తీసుకుంటారు.  అయితే గర్భంతో ఉన్న సమయంలో ఇలా చేయకండి. తులసి ఆకుల్లో ఈస్ట్రోగోల్ అనే రసాయనం ఉంటుంది. ఇది గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.

అధిక క్యాలరీలు

అధిక క్యాలరీలు ఉన్న  ఆహార పదార్థాలను తినడం వల్ల మహిళలు బరువు పెరుగుతారు. శరీరంలో కొవ్వు పేరుకుపోయి గర్భధారణ సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి అబార్షన్ కూడా అయ్యే ప్రమాదం ఉంది.   కాబట్టి  గర్భిణీలు ఉడకని మాంసం, సీఫుడ్, ప్రాసెస్ చేసిన మాంసం,  నూనెలో ఎక్కువ వేయించిన,  కాల్చిన మాంసం అసలు తినకూడదు.

Also Read: Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

Goa Assembly Election: ఫలితాలు అలా వస్తే.. గోవాలో పొత్తులపై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సంచల ఎత్తులు..

Megha Akash: అందాల సోయగం.. నవ్వుల నయాగారం మేఘా ఆకాష్ సొగసులు చూడతరమా.!