Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Assembly Election: ఫలితాలు అలా వస్తే.. గోవాలో పొత్తులపై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సంచల ఎత్తులు..

గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP) మెజారిటీ సాధించడంలో విఫలమైతే..  ఎన్నికల తర్వాత ఇతర బీజేపీయేతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని కేజ్రీవాల్

Goa Assembly Election: ఫలితాలు అలా వస్తే.. గోవాలో పొత్తులపై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సంచల ఎత్తులు..
Aravind Kejriwal
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 16, 2022 | 10:42 PM

Goa Assembly Elections 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రచారం హాట్ హాట్‌గా సాగుతోంది. అన్ని రాష్ట్రాల్లో ప్రాచారం అన్ని పార్టీలు బీజేపీని కార్నర్ చేస్తున్నాయి. తాజాగా గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పట్టుసాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రయత్ని‍స్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రచారంలోకి రంగ ప్రవేశం చేసిన ఆప్‌ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఆదివారం గోవాలో పర్యటించారు. గోవా ప్రజలు, అభివృద్ధి కోసం 13 పాయింట్ల ఎజెండాతో కూడిన ‘విజన్ ప్లాన్‌’ను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. అంతటితో ఆగకుండా పనిలో పనిగా బీజేపీని టార్గెట్ చేస్తూ మాటల తూటలను సందించారు.

గోవాలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ బీజేపీపై పలు విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన పార్టీల్లో ఆప్‌ అత్యంత నిజాయితీ ఉన్న పార్టీ అని స్వయంగా ప్రధాని మోడీనే చెప్పారని అన్నారు. అంతేకాదు సర్టిఫికెట్‌ ఆఫ్‌ హానెస్టీ(నిజాయితీ) కూడా ఇచ్చారు అంటూ వెటకారం ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ.. “ప్రధాని మోడీగారు నా మీద, మనీశ్‌ సిసోడియా మీద సీబీఐ దాడులు చేయించారు. మా ఎమ్మెల్యేలను 21 మందిని అరెస్ట్‌ చేయించారు. 400 ఫైల్స్‌ను పరిశీలించాలని ఒక కమిషన్‌ కూడా వేశారు. ఏం ఒరిగింది? ఏం జరగలేదు.. అవినీతిరహిత పాలన అనేది మా డీఎన్‌ఏలోనే ఉంది అంటూ ప్రశంసించుకున్నారు అరవింద్‌ కేజ్రీవాల్‌.

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఎజెండాను తప్పకుండా అమలు చేస్తామని హామీలు గుప్పించారు. ఫిబ్రవరి 14న జరిగే ఎన్నికల కోసం గోవా ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్ తప్ప మరో మార్గం లేని గోవా ప్రజలకు ఇప్పుడు ‘ఆప్’ ఆదుకేనేందుకు వచ్చిందన్నారు. ఆ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారని వెల్లడిచారు.

గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP) మెజారిటీ సాధించడంలో విఫలమైతే..  ఎన్నికల తర్వాత ఇతర బీజేపీయేతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని కేజ్రీవాల్ ఆదివారం సరికొత్త ఎత్తుగడకు తెరలేపారు. పార్టీ మాత్రమే ప్రజా సమస్యలపై ఎన్నికల్లో పోరాడుతోందని ఆరోపించారు. “మేము ఉచిత  బిజిలీ తదితర హామీలు ఇస్తున్నట్లే…కాంగ్రెస్ కూడా హామీ ఇస్తోంది. కాంగ్రెస్‌కు ప్రతి ఓటు బిజెపికి వెళుతుంది. ఏ గోవా అయినా కాంగ్రెస్‌కు ఎందుకు వేస్తారు? వారి 17 మంది ఎమ్మెల్యేలలో 15 మంది అమ్ముడుపోయారు!” అంటూ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. పలు మార్గాల్లో రైళ్లు రద్దు..

BSF Recruitment 2022: దేశ సరిహద్దుల్లో పనిచేయాలనుకుంటున్న యువకులకు గుడ్‌న్యూస్.. బీఎస్ఎఫ్‌ భారీ నోటిఫికేషన్‌..